అణు బెదిరింపులకు భారత్ తలొగ్గదు.. పాక్ కు ఇచ్చిపడేసిన భారత్..!
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ కు మరోసారి భారత్ కీలక వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ అణు బెదిరింపులకు తలొగ్గేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రథమ కమిటీ సమావేశంలో పాకిస్థాన్ కు భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చింది. అలాగే జమ్మూ కాశ్మీర్ భారత్ లో విడదీయలేని భాగమేనని తెలిపింది. జమ్మూ కాశ్మీర్ అంశంపై యూఎన్ సమావేశం వేదికగా ప్రపంచాన్ని పాకిస్థాన్ తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఎంపీ మహిమా కుమారి మేవార్ తెలిపారు. పీఓకే లో మానవహక్కులను పాక్ మంటలో కలుపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఓకే లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఐక్యరాజ్యసమితిలో వివరించే ధైర్యం పాకిస్థాన్ కు ఉందా అని ప్రశ్నించారు.
అలాగే జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రథమ కమిటీ సమావేశంలో భారత్ కు చెందిన సీనియర్ సలహాదారు అన్మోల్ షేర్ సింగ్ బేడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ అణ్వాయుధాలను రోజువారీ దౌత్యంలో భాగంగా ఉపయోగించలేరని.. ఎలాంటి అణు బెదిరింపులకు కూడా భారత్ తలొగ్గబోదని తేల్చి చెప్పారు. అలాగే భారత్ రక్షణ సామర్థ్యాలు పూర్తిగా దేశ భద్రతా అవసరాలకు అనుగుణంగానే ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే జమ్మూ కాశ్మీర్ అంశంపైనా మాట్లాడుతూ.. పీఓకేను ఇల్లీగల్ గా ఆక్రమించిన టెర్రరిస్టులు ఆ ప్రాంతాన్ని వెకేట్ చేసి వెళ్లిపోవాలని అన్నారు. భారత్.. పాకిస్థాన్ తో యుద్ధం కోరుకోవట్లేదని తెలిపారు. భారత్ ఎప్పూడూ శాంతినే కోరుకుందని.. అందరితోనూ శాంతియుతంగా ఉండేందుకే భారత్ ప్రాధాన్యతను ఇస్తుందన్నారు.

అలాగే పాకిస్థాన్ కుతంత్రాలు భారత్ కు తెలుసని అన్మోల్ షేర్ సింగ్ బేడీ పేర్కొన్నారు. పాకిస్థాన్ ఫస్ట్ రెచ్చగొడుతుందని.. దాడుల అనంతం బాధ్యతను తీసుకోకుండా ఆలస్యం చేస్తుందని.. ఆ తర్వాత శాంతిని కోరుకుంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాక యూఎన్ సమావేశం అంతర్జాతీయ వేదికగా పాకిస్థాన్, టెర్రరిజం విషయంలో భారత్ తన వైఖరిని మూడు అంశాల ద్వారా వివరించింది. భారత్ పై జరిగే ఉగ్ర దాడులకు తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని పేర్కొంది. అలాగే అణు బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గబోమని స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించే వారు.. ఆర్థిక సహాయం అందించేవారు.. టెర్రరిజం వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల విషయంలోనూ బాధ్యతను నిర్ధారించాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications
