స్విస్ బ్యాంక్ చిట్టాలో 61వ స్థానానికి భారత్, కానీ
జ్యూరిచ్: స్విస్ బ్యాంకుల్లో నల్లధనం ఖాతాలు, మొత్తాల విషయంలో భారత్ 61వ స్థానానికి పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆ బ్యాంకుల్లో ఉన్న మొత్తం సంపదతో పోలిస్తే భారత్‌కు చెందింది కేవలం 0.123 శాతం మాత్రమే ఉంది.
ఈ విషయాన్ని స్విట్జర్లాండుకు చెందిన కేంద్ర బ్యాంకింగ్ ప్రాధికార సంస్థ అయిన స్విస్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది. మొత్తంగా ప్రపంచ సంపద 1.6 అమెరికన్ డాలర్ల మేర ఉంది.

బ్రిటన్, అమెరికాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. పాకిస్తాన్ 73వ స్థానంలో నిలిచింది. 2014లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల్లో నిలువ సుమారు రూ.12,615 కోట్లుగా ఉంది.
స్విస్ నేషనల్ బ్యాంక్ విడుదలచేసిన అధికారిక లెక్కల్లో భారతీయులు, ఇతర దేశాల వారు వివిధ దేశాల నుంచి పలు సంస్థల పేరుతో నిలువ చేసుకున్న డబ్బు వివరాలు లేవు.












Click it and Unblock the Notifications