పాకిస్థాన్‌లో భారీ పేలుడు: 50కి చేరిన మృతుల సంఖ్య
శిఖర్పూర్: పాకిస్థాన్‌లోని శిఖర్పూర్ జిల్లాలోని లఖిదార్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో సుమారు 50 మంది మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. ఘటన జరిగిన ప్రాంతం కరాచీ రాజధాని సింద్‌కు 511 కిలోమీటర్ల దూరంలో ఉంది.

శుక్రవారం ఇమామ్ బర్గా మోల కరబాల వద్ద ప్రార్థనలు చేసుకుంటున్న సమయలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
శిఖర్పూర్ పరిసరాల ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ముత్తహిదా కయామి మూవ్‌మెంట్ అధిపతి అల్తాఫ్ హుస్సేన్, పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ పేలుడు ఘటనను ఖండించారు. పెషావర్ స్కూల్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు సుమారు 150 మంది ప్రాణాలను బలిగొన్న ఘటనను మరవకముందే ఈ ఘటన చోటుసుకోవడం స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.












Click it and Unblock the Notifications