జవాబుదారీతనాన్ని తీసుకోండి: భారత్‌కు అమెరికా అనూహ్య సూచన..!!
వాషింగ్టన్: భారత్- కెనడా మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్.. హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ స్వయానా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో చేసిన ప్రకటన రేపిన ప్రకంపనలు ఈ రెండు దేశాల మధ్య అగాథాన్ని సృష్టించాయి.
జూన్ 18వ తేదీన ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జార్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కెనడాలో ఈ హత్య చోటు చేసుకుంది. బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలోని గురుద్వారా బయట గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో ఆయన మరణించారు. ఈ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉందనేది కెనడా చేస్తోన్న ఆరోపణ.

ఈ హత్యకేసు వ్యవహారంలో ముమ్మర దర్యాప్తు సాగిస్తోంది కెనడా ప్రభుత్వం. ఇందుకు తనవంతు పూర్తిస్థాయి సహాయ సహాకారాలను అందించాలంటూ అగ్రరాజ్యం అమెరికా.. భారత్‌కు సూచనలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదొక అనూహ్య పరిమాణంగా భావిస్తోన్నారు.
విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోన్నారు. వాషింగ్టన్ డీసీలో అయిదు రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటొని బ్లింకెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బ్లింకెన్.. బహిరంగంగా ఈ సూచన చేశారు.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లేవనెత్తిన ఆరోపణలపై తాము ఆందోళన చెందుతున్నామని ఆంటోని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. దీనిపై కెనడాతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. అదే సమయంలో- భారత్‌తోనూ ఇదే విషయంపై చర్చిస్తోన్నామని బ్లింకెన్ తెలిపారు. జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలపై కెనడా ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని గుర్తు చేశారు.
ఈ విషయంలో కెనడాతో కలిసి పని చేయాలని తాము భారత్‌నను కోరినట్లు బ్లింకెన్ తేల్చి చెప్పారు. సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో ఏర్పాటైన సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించానని అన్నారు. జవాబుదారీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తాను మరోసారి గుర్తు చేస్తోన్నానని బ్లింకెన్ వివరించారు. కెనడా- భారత్ ఈ సమస్యను ఉమ్మడిగా పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications