మహిళ తల నరికి చేతబుచ్చుకుని.. సూపర్ మార్కెట్ లోకి వెళ్లి...

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికాలోని ఓరిగాన్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. మిట్ట మధ్యాహ్నం ఓ వ్యక్తి ఒళ్లంతా రక్తంతో, నరికేసిన తలను చేత్తో పట్టుకుని సూపర్‌ మార్కెట్లోకి వచ్చాడు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిపై కత్తితో దాడి చేశాడు.

ఎస్టకాడా పట్టణంలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకుగురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్టకాడాలోని థ్రిఫ్ట్‌వే గ్రాసరీ స్టోర్‌లోకి ఆదివారం మధ్యాహ్నం ఓ వ్యక్తి ప్రవేశించాడు.

ఒంటినిండా రక్తం, చేతిలో ఓ మనిషి తలతో ఉన్న ఆ వ్యక్తిని చూడగానే అక్కడున్న వాళ్లు భయకంపితులయ్యారు. అతడెవరో, అక్కడికెందుకొచ్చాడో, చేతిలో ఆ తలేంటో.. ఇవన్నీ ఆలోచించే లోపే సదరు వ్యక్తి.. గ్రాసరీ స్టోర్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న మైక్‌ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. తేరుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Blood-soaked maniac carrying a HUMAN HEAD walks into a supermarket and stabs an employee

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ మైక్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు వింతగా ప్రవర్తించాడు. పోలీసులు ఎన్ని ప్రశ్నలు వేసినా కనీసం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ఒక్కసారి మాత్రం దాహం వేస్తుంది, నీళ్లు కావాలని అడిగాడట. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే పోలీసులకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. కాల్టన్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో మహిళ చనిపోయి ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిందితుడు తీసుకొచ్చిన తల ఆ మహిళదేనా? అన్న విషయాన్ని మాత్రం పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A SUSPECTED killer walked into a US supermarket covered in blood while clutching a knife and what looked like a human head before stabbing a worker, it has been reported. Police rushed to the sickening scene at Harvest Market Thriftway in Estacada in the US state of Oregon at around 2.15pm yesterday. Other staff tackled the knifeman and held him down until cops arrived. He is now in custody, reports KGW.The store worker was airlifted to Emanuel Hospital in the city of Portland for treatment. The suspect was also taken to a nearby hospital.
Please Wait while comments are loading...