వైట్ హౌస్‌లో షారుఖ్ ఖాన్ పాటలతో మోదీకి స్వాగతం

వాషింగ్టన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి లాన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడి నుంచి నేరుగా వాషింగ్టన్‌కు చేరుకున్నారు. ఆయన చేపట్టిన అమెరికా పర్యటన సత్ఫలితాలను అందిస్తోంది. ఆయన అమెరికాలో ఉండగానే.. భారత్‌పై పలు వరాలను కురిపించింది అగ్రరాజ్యం. భారత్‌లో కొత్తగా కాన్సులేట్లను ఏర్పాటు చేయబోతోన్నట్లు ప్రకటించింది.

తొలిదశలో రెండు నగరాలను ఎంపిక చేసింది. ఇందులో ఒకటి- బెంగళూరు. సిలికాన్ సిటీగా గుర్తింపు పొందిన బెంగళూరులో కొత్తగా కాన్సులేట్‌ను ఏర్పాటు చేస్తామని వైట్‌హౌస్ వెల్లడించింది. వైట్ హౌస్‌లో జో బైడెన్- ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన స్టేట్ డిన్నర్‌కు ప్రధాని హాజరు కావాల్సి ఉంది. ఆయన రాకకోసం వైట్ హౌస్ ముస్తాబయింది. కొద్దిసేపటి కిందటే ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వైట్ హౌస్‌కు చేరుకున్నారు.

Bollywoods Super hit song Chaiyya Chaiyya enchants at the White House

మోదీ రాకకోసం వందలాది మంది ప్రవాస భారతీయులు వైట్ హౌస్ వద్ద ఎదురు చూస్తోన్నారు. మోదీకి జై కొట్టారు. మోదీ, మోదీ అంటూ నినదించారు. వైట్ హౌస్ సౌత్ లాన్ గేట్ వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలను వైట్ హౌస్ సౌత్ లాన్‌కు అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి. ప్రవాస భారతీయులందరూ మువ్వన్నెల పతాకాలను చేతపట్టుకుని మోదీకి స్వాగతం పలకడానికి సన్నద్ధం అయ్యారు.

వైట్ హౌస్ వద్ద మోదీని కలుసుకోబోతోండటాన్ని అపురూపమైన క్షణంగా అభివర్ణించారు నేషనల్ యూఎస్-ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పూర్ణిమా వోరియా. మోదీని చూసి గర్విస్తోన్నామని ఆమె వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు ఎప్పుడే గానీ ఇంత మంది ప్రవాస భారతీయులను వైట్‌హౌస్‌లోని సౌత్ లాన్‌లకు రానివ్వలేదని, ఆ కొరత ఇప్పుడు తీరిందని వ్యాఖ్యానించారు.

పెన్ మసాలా రాక్ బ్యాండ్ ఆర్టిస్టులు తమ పాటలతో ప్రవాస భారతీయులను ఉర్రూతలూగించారు. ఛయ్య, ఛయ్య పాటను ఆలపించారు. దీనితో పాటు పలు బాలీవుడ్ సూపర్ హిట్ ట్రాక్స్‌ను వారు కోరస్‌గా పాడుతూ ఉల్లాసపరిచారు. భారత సంతతికి చెందిన కళాకారిణి ఒకరు వయోలిన్‌ను హృద్యంగా ప్లే చేశారు. దీనితో వైట్ హౌస్ పరిసరాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమం అనంతరం మోదీ- అమెరికన్ జాయింట్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+