పోలియో కేంద్రం వద్ద భారీ పేలుడు: 15మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో ఓ పోలియో కేంద్రం సమీపంలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఓ అనుమాతుడు ఆత్మాహుతికి దాడికి పాల్పడటం వల్లే ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15మంది మృత్యువాతపడ్డారు. మరో 20మందికి గాయాలైనట్లు సమాచారం.
పోలియో కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో 12మంది పోలీసులు, ఒక పారామిలిటరీ అధికారి, ఇద్దరు సామాన్య ప్రజలు ఉన్నట్లు అధికారులు చెప్పారు.

గాయపడిన వారిలో కూడా ఎక్కువ మంది పోలీసులే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రదాడిలో ఇద్దరు దుర్మరణం
ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పాక్ ఎంబసీ ఆఫీసు వద్ద జరిగిన ఉగ్రదాడిలో నలుగురు మృతిచెందారు. పాక్ పాస్‌పోర్టుల కోసం క్యూలో నిలబడ్డ జనంలోకి ఆత్మాహుతి దళ సభ్యుడు ప్రవేశించటానికి ప్రయత్నించాడు. సెక్యూరిటీ అడ్డు చెప్పటంతో అతను తనకు తాను పేల్చేసుకున్నాడు. కాగా, ఈ దాడిలో భారతీయులకు ఏమీ కాలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications