వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైవ్ డెత్: కోర్టులో అందరూ చూస్తుండగా.. జడ్జి ముందే విషం తాగేశాడు!

కోర్టు హాలులో ఒకపక్క వాదనలు జరుగుతుండగానే… విషం తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఓ వ్యక్తి. ఈ ఘటన బుధవారం ది హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో జరిగింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Criminal lost life after consuming Poison during hearing | Oneindia Telugu

వాషింగ్టన్: కోర్టు హాలులో ఒకపక్క వాదనలు జరుగుతుండగానే... విషం తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఓ వ్యక్తి. ఈ ఘటన బుధవారం ది హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే... బోస్నియాకు చెందిన వార్ కమాండర్ జనరల్ స్లోబోడన్ ప్రల్జాక్‌ను యుద్ధనేరస్థుడిగా పరిగణిస్తూ 20 ఏళ్ల జీవితఖైదు విధించింది న్యాయస్థానం. ఈ తీర్పును సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానంలో అప్పీల్ చేసుకున్నాడు స్లోబోడన్.

hague-slobodan

దీనిపై బుధవారం వాదనలు జరుగుతుండగా, ఆ సమయంలో తనకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తుండటంతో.. కోర్టు హాలులోనే టీవీ కెమేరాల సాక్షిగా స్లోబోడన్ విషం తాగేశాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన జడ్జి.. వాదనలు నిలిపివేశారు.

అతడికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. డాక్టర్ అక్కడికి చేరుకునేలోపే స్లోబోడన్ మృతి చెందినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కోర్టు హాలులో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారని అక్కడి అధికారులు చెబుతున్నారు.

English summary
A former Bosnian Croat general has died after drinking a phial of poison while standing in the dock at a UN tribunal in The Hague, where his war crimes sentence of 20 years was upheld. Seconds after the judges had delivered their decision at the international criminal tribunal for the former Yugoslavia (ICTY) on Wednesday, Slobodan Praljak shouted out angrily: “Praljak is not a criminal. I reject your verdict.” The 72-year-old then raised a small brown bottle to his lips, and drank it in full view of the cameras filming the hearing. “I just drank poison,” he said. “I am not a war criminal. I oppose this conviction.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X