శబాష్ పోలీస్: ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ ను పట్టుకొన్నాడిలా..(వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇస్లామాబాద్: రోడ్డు ప్రమాదానికి కారణమైన ఓ ట్రక్కును డ్రైవర్ ను పట్టుకొనేందుకుగాను పాకిస్తాన్ కు చెందిన ఓ పోలీసు అధికారి సినిమాను తలపించేరీతిలో సాహసాన్ని ప్రదర్శించి ట్రక్కు డ్రైవర్ ను పట్టుకొన్నాడు. ఈ ఘటనను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

సినిమాల్లో క్లైమాక్స్ లో నిర్వహించే ఫైటింగ్ సీన్లను తలపించేరీతిలో ఓ పాకిస్తాన్ పోలీసు అధికారి వ్యవహరించారు. టక్కుతో వాహనాన్ని ఢీకొట్టి పారిపోతున్న ట్రక్కు డ్రైవర్ ను పట్టుకొనేందుకుగాను పోలీస్ అధికారి సాహసోపేతంగా వ్యవహరించారు.

సినిమాల్లో చూపించే విధంగా ట్రక్కును వెంబడించి బైకును వదిలేసి ట్రక్కుపై ఎక్కాడు. పోలీసును చూసి ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని మరింత వేగంగా నడుపుతూ వెళ్ళాడు.

అదే సమయంలో వెనకే బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీశాడు. పోలీసుని గమనించిన మరో వ్యక్తి తన బైక్ ని వేగంగా ట్రక్కు ముందుకు పోనిచ్చాడు. కొన్ని వాహనాలు ఆగి ఉండడంతో చేసేదిలేక డ్రైవర్ ట్రక్కును ఆపేశాడు. దీంతో డ్రైవర్ ను పోలీసు అదుపులోకి తీసుకొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
a traffic warden from Pakistan, clinging on to a speeding truck and putting his life at grave risk as he tried fighting the driver, is now going viral on social media. The officer is garnering heaps of praise for his courageous act because, as evident from the video, he did not seem to have thought twice before trying to catch the driver who had reportedly ran his truck over a citizen.
Please Wait while comments are loading...