వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోల్స్ రాయ్స్ షాకింగ్ నిర్ణయం.. 9వేల మందికి ఉద్వాసన.. 1987 తర్వాత ఇదే మొదటిసారి..

|
Google Oneindia TeluguNews

బ్రిటన్‌కు చెందిన విమాన ఇంజన్ తయారీ సంస్థ రోల్స్ రాయ్స్ భారీ ఎత్తున ఉద్యోగాల కోతకు సిద్దమైంది. తమ సంస్థలో దాదాపు 9వేల ఉద్యోగాలకు కోత పెట్టనుంది. లేదా మొత్తం ఉద్యోగుల్లో ఆరో వంతు ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. అంతేకాదు,తమ సంస్థకు చెందిన పలు ఫ్యాక్టరీ యూనిట్లను మూసివేసే అవకాశం కూడా ఉంది. కరోనా లాక్ డౌన్ ఏవియేషన్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపడటంతో.. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఈ చర్యకు సిద్దమైంది.

ఎందుకీ పరిస్థితి..

ఎందుకీ పరిస్థితి..

రోల్స్ రాయ్స్ కంపెనీ బోయింగ్ 787,ఎయిర్‌బస్ 350 వంటి విమానాలకు ఇంజన్లను తయారుచేస్తుంది. అయితే కరోనా సంక్షోభంతో మార్కెట్లో రోల్స్ రాయ్స్ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయింది. దీంతో డిమాండ్‌ మేరకే ఉత్పత్తులు జరిపేందుకు ఉద్యోగాల్లో కోతకు సిద్దమైంది. 'అవసరమైన డిమాండ్ మేరకే మేము మా సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఈ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టేందుకు ఖర్చు తగ్గింపు చర్యలు చేపట్టాం.' అని రోల్స్ రాయ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వారెన్ ఈస్ట్ తెలిపారు.

1987 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి..

1987 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి..

1987లో కంపెనీ ప్రైవేటీకరణ తర్వాత ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాల కోత ఇదే మొదటిసారి అని వారెన్ తెలిపారు. ప్రస్తుత అంచనాల మేరకు ప్రపంచవ్యాప్తంగా రోల్స్ రాయ్స్‌ సివిల్ ఏరోస్పేస్ బిజినెస్‌కు ఉన్న 52వేల మంది సిబ్బందిలో 9వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. తద్వారా సంస్థకు 18 బిలియన్ డాలర్ల ఖర్చు ఆదా కానుంది. తమ సంస్థ 1.3 బిలియన్ పౌండ్ల వార్షిక ఆదాయ పొదుపును లక్ష్యంగా పెట్టుకుందని.. ఇందులో 700 మిలయన్లు ఉద్యోగాల్లో కోత,ఫ్యాక్టరీల మూత ద్వారా సమకూరుతాయని తెలిపింది.

పడిపోయిన షేర్స్..

పడిపోయిన షేర్స్..

రోల్స్ రాయ్స్ హెడ్ క్వార్టర్స్ సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని డెర్బీలో ఉంది. దాదాపు మూడొంతుల్లో రెండు వంతుల స్టాఫ్ యూకెలోనే ఉన్నారు. బహుశా ఉద్యోగాల కోత కూడా అక్కడినుంచే మొదలుకావచ్చునని సీఈవో తెలిపారు. మరో మూడు లేదా ఐదేళ్ల వరకు ఏవియేషన్ ఇండస్ట్రీ కుదురుకునే అవకాశం లేదని.. అందుకు అనుగుణంగా తమ సంస్థ సిద్దమవుతోందని చెప్పారు. 2020లో రోల్ రాయ్స్ షేర్స్ 62శాతం క్షీణించి 11 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయాయి.

English summary
Rolls-Royce plans to cut at least 9,000 jobs, or more than a sixth of its workforce, in the latest blows to the UK economy and aviation industry dealt by the coronavirus pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X