9 మంది వదిలేశారు, 69 ఏళ్ళలో పెళ్ళికి సిద్దమైన షెఫర్డ్

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: పెళ్లైన కొద్ది రోజులకే భార్యలు వదిలివెళ్తుంటే .. ఆయన మాత్రం పెళ్ళిళ్ళు చేసుకొంటూనే ఉన్నాడు.69 ఏళ్ళ వయస్సులో ఉన్న రాన్ షెఫర్డ్ మరో పెళ్ళికి సిద్దమౌతున్నాడు. తన కంటే 41 ఏళ్ళ చిన్నదైన క్రిస్టెట్ మార్క్వెజ్ పెఫర్డ్‌ను ఇటీవలే వదిలేసింది. దీంతో ఆయన మరో పెళ్ళికి సిద్దమౌతున్నాడు.

బ్రిటన్‌కు చెందిన 69 ఏళ్ళ పెఫర్డ్ మరో పెళ్ళికి సిద్దమయ్యారు. ఈ వయస్సులో కూడ ఆయన పెళ్ళి చేసుకోవాలని ఆశ పడుతున్నాడు. కారణాలేమిటో తెలియదు కానీ, ఆయన వివాహం చేసుకొన్న వారంతా ఆయనతో కాపురం చేసిన కొద్ది నెలలకే ఆయనను వదిలేసి వెళ్ళిపోతున్నారు.

అయితే వివాహం కోసం మాత్రం షెఫర్డ్ వయస్సు నిబంధనను ఖచ్చితంగా పాటించాల్సిందేనని అంటున్నాడు. 30 ఏళ్ళ వయస్సును మహిళలైతే తనకు ఫరవాలేదని చెబుతున్నారు.

69 ఏళ్ళకు మరోసారి పెళ్ళికి సిద్దం

69 ఏళ్ళకు మరోసారి పెళ్ళికి సిద్దం


బ్రిటన్‌కు చెందిన షెఫర్డ్ 69 ఏళ్ళ వయస్సులో 10 పెళ్ళికి సిద్దమయ్యాడు. షెషర్డ్ ‌కు తొమ్మిదో భార్యగా ఉన్న క్రిస్టెట్‌ మార్క్వెజ్‌ (28) అతడిని విడిచిపెట్టింది. షెఫర్డ్ కంటే ఆమె 41 ఏళ్ళు చిన్నది. ఆమె తనను వదిలిపెట్టిన వెళ్ళినందున మరోసారి పెళ్ళి చేసుకోవాలని షెఫర్డ్ భావిస్తున్నారు. తనను వివాహం చేసుకొనేందుకు గాను అనువైన మహిళల కోసం షెఫర్డ్ ఆరా తీస్తున్నారు.

పరిణితి చెందిన మహిళ కోసం

పరిణితి చెందిన మహిళ కోసం


ప్రతి సారీ కొంతకాలం పాటు తనతో కాపురం చేసి వదిలేసి వెళ్ళే భార్యలు కాకుండా ఉండాలని షెఫర్డ్ భావిస్తున్నారు. అందుకే ఈ దఫా బాగా పరిణితి చెందిన యువతి కోసం వెతుకుతున్నారు.. ఫేస్‌బుక్‌లో పలువురు మహిళలతో మాట్లాడుతున్నాడు రాన్‌ షెఫర్డ్‌

1966లో తొలి వివాహం

1966లో తొలి వివాహం


1966లో రాన్‌ తొలి భార్య మార్గరెట్‌ మెడలో మూడు ముళ్లు వేశాడు.కొన్నేళ్లకే ఆమెకు విడాకులిచ్చాడు షెఫర్డ్‌ .అప్పటి నుంచి వరుస పెళ్లిళ్లీ బాట పట్టాడు. రెండేళ్లు కాపురం చేసి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకు విడాకులిచ్చి 1973లో జెనెట్టేను వివాహమాడాడు. ఇక 1976లో ముచ్చటగా మూడోభార్యగా లెస్లీకి చేరువయ్యారు. ఇద్దరు కుమారులు జన్మించిన తర్వాత 1981లో లెస్లీకి విడాకులిచ్చి ఏడాది అనంతరం 1982లో కాథీని పెళ్లాడాడు. 1986లో ఐదో భార్యగా సూను చేరదీసిన రాన్‌ షెఫర్డ్‌ ఒక కుమార్తె కలిగిన అనంతరం 1997లో వీరి వైవాహిక జీవితానికి బ్రేక్‌ పడింది.

ఆరో భార్యగా ఉష

ఆరో భార్యగా ఉష


1999లో ఆరో భార్యగా ఉషా ఆయన పెళ్ళి చేసుకొన్నారు. . నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ కూడ విడిపోయారు.2003లో వాన్‌ అనే యువతిని జీవిత భాగస్వామిగా చేసుకుంటే ఆమె కేవలం నాలుగు నెలలకే రాన్‌కు బై చెప్పేసింది. ఇక​ 2004లో వాంగ్‌ అనే మహిళను ఎనిమిదో భార్యగా ఆహ్వానించాడు. పదేళ్ల పాటు వీరి జీవితం సాఫీగా సాగినా 2015లో వీరు విడిపోయారు. అనంతరం తొమ్మిదవ భార్యగా వచ్చిన క్రిస్టెట్‌ గత వారం రాన్‌కు వీడ్కోలు పలికింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An unlucky-in-love great-grandfather, who is the most married man in Britain, has set his sights on tying the knot again after being ditched by the woman set to be his NINTH wife.Ron Sheppard was stunned when Cristel Marquez, who is 41 years his junior, walked out on him on Friday, but now says he wants to find someone 'more mature

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి