ఇమ్మిగ్రేషన్ విసాలను నిలిపివేసిన బ్రిటన్: విదేశీ విద్యార్థులపైన కఠిన ఆంక్షలు: రిషి సునాక్ సంచలనం

బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలను తీసుకుంది. సరికొత్త విసా పాలసీలను ప్రకటించింది. అనేక విప్లవాత్మక సవరణలను చేసింది ఇందులో. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో స్వదేశీయులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. విసా విధానాల్లో తీసుకొచ్చిన మార్పులు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాయనీ తెలిపింది.

ఇందులో భాగంగా- ఇమ్మిగ్రేషన్ విసా (UK immigration visa)లను నిలిపివేసింది బ్రిటన్ ప్రభుత్వం. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak) స్వయంగా వెల్లడించారు. ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్య చాలా అధికంగా ఉంటోందని, దీన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

Britain stopped immigration visa and banning overseas students from bringing their families

అదే సమయంలో స్కిల్డ్ వర్కర్స్ మంజూరు చేస్తోన్న కనీస వేతనాన్ని భారీగా పెంచింది బ్రిటన్ ప్రభుత్వం. వారి కనీస వేతనాన్ని 20 శాతానికి పెంచింది. అంటే- ఇప్పుడు పని చేస్తోన్న స్కిల్డ్ వర్కర్లకు ఇస్తోన్న కనీస వేతనం మొత్తానికి 20 శాతాన్ని అధికంగా చేర్చాల్సి ఉంటుంది ఆయా సంస్థల యాజమాన్యానికి.

2022లో బ్రిటన్ ప్రభుత్వం జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్య 7,45,000. ఆ దేశ చరిత్రలో ఇదే అత్యధికం. ఈ సంఖ్యను మూడు లక్షల కంటే దిగువకు తీసుకుని రావాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ఆ దేశ హోం మంత్రి జేమ్స్ క్లెవెర్లీ తెలిపారు. దీనికోసం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పలేదని వ్యాఖ్యానించారు.

గతంలో యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి బ్రిటన్‌కు పెద్ద సంఖ్యలో వలసదారులు తరలి వచ్చేవారు. ఈ మధ్యకాంలో భారత్, నైజీరియా, చైనా నుంచి వచ్చే వారి సంఖ్య భారీగా ఉంటోంది. గత ఏడాది జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ విసాల్లో ఈ మూడు దేశాల వారే అధికంగా ఉన్నారు.

బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తోన్న విదేశీ విద్యార్థులపైనా రిషి సునాక్ ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది. విదేశీ విద్యార్థులు తమ కుటుంబాలను బ్రిటన్‌కు తీసుకుని రావడంపై నిషేధాన్ని ప్రకటించింది. రీసెర్చ్ డిగ్రీలు చేసే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇందులో నుంచి మినహాయింపు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+