మాల్యాకు బ్రిటిష్ ప్రభుత్వం షాక్: భారత్ ప్రయత్నంలో ముందడుగు

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: రూ.9వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాను తిరిగి భారతదేశానికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. ఆయనను భారతదేశానికి పంపించాలన్న అభ్యర్థనను బ్రిటిష్ ప్రభుత్వం సర్టిఫై చేసింది.

ఆయనకు వారంట్ జారీ చేయడంపై యునైటెడ్ కింగ్‌డమ్ కోర్టు పరిశీలిస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

vijay mallya

మాల్యాను భారతదేశానికి పంపించాలన్న విజ్ఞప్తిని బ్రిటన్ హోం శాఖ కార్యదర్శి ధ్రువీకరించినట్లు బ్రిటన్ హోం శాఖ కార్యాలయం తెలిపిందన్నారు. యూకే హోం ఆఫీస్ అపరాధిని అప్పగించాలన్న వాదనను వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్‌ కోర్టులోని జిల్లా జడ్జి పరిశీలనకు పంపించిందని తెలిపారు. వారంటును జిల్లా జడ్జి జారీ చేయవలసి ఉంటుందని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Ministry of External Affairs on Friday said the British government has certified India's request for loan defaulting liquor baron Vijay Mallya's extradition and a UK court is considering issuing warrant for the same.
Please Wait while comments are loading...