ప్రధాని మోడీకి బల్గేరియా అధ్యక్షుడు రుమెన్ స్పెషల్ థ్యాంక్స్: ఎందుకంటే?

సోఫియా/న్యూఢిల్లీ: బల్గేరియా అధ్యక్షుడు రుమెన్ రాదేవ్, ఆ దేశ ప్రజా ప్రతినిధులు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపరాు. అరేబియా సముద్రంలో సోమాలియా దొంగల చేతిలో హైజాక్‌కు గురైన ఎంవీ రూయెన్ అనే వాణిజ్య ఓడను, అందులోని బల్గేరియాకు చెందిన పౌరులను భారత నౌకాదళం ప్రాణాలకు తెగించి కాపాడింది. ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ సుభద్రలతోపాటు సీ గార్డియన్‌ డ్రోన్ల సహాయంతో సక్సెస్ ఫుల్ గా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది.

ఆపరేషన్‌లో భాగంగా భారత వాయుసేన తన సీ-17 రవాణా విమానం ద్వారా రెండు చిన్న పాటి యుద్ధ బోట్లను ఖచ్చితమైన ప్లేస్‌లో జారవిడిచింది. మెరైన్ కమెండోలు కిందికి దిగి సముద్రపు దొంగల ఆట కట్టించారు. అలాగే ఓడలోని బందీలను విడిపించారు. కాగా, ఈ నౌకా సిబ్బందిలో ఏడుగురు బల్గేరియా పౌరులు ఉన్నారు. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు రుమెన్ రాదేవ్ సోషల్ మీడియా వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, భారత ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Bulgaria President Rumen Thanks PM Narendra Modi For India s Brave Action In Rescuing Hijacked Bulgarian Ship

'సముద్రపు దొంగల చేతికి చిక్కన రూయెన్ నౌకను, అందులోని ఏడుగురు బల్గేరియా పౌరులను రక్షించడం కోసం భారత నౌకా దళం ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించింది. మా దేశస్థులను కాపాడినందుకు భారత నేవీ సిబ్బందికి, అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు' అని ట్వీట్ చేశారు బల్గేరియా అధ్యక్షులు రుమెన్ రాదేవ్.

మరోవైపు, బల్గేరియా ఉప ప్రధాని, విదేశాఖమంత్రి మారియా గాబ్రియెల్ కూడా భారత్ కు ప్రత్యేక ధన్వవాదాలు తెలిపారు . 'రూయెన్ నౌకను కాపాడటంలో మీరు అందించిన సహకారానికి ధన్యవాదాలు. సిబ్బంది రక్షణ కోసం కలిసి పనిచేస్తాం' అని అన్నారు. దీనికి భారత విదేశాంగమంత్రి జై శంకర్ కూడా స్పందించారు. 'స్నేహితులు ఉన్నది అందుకే కదా' అంటూ తనదైన శైలిలో జవాబిచ్చారు.

కాగా, సుమారు 40 గంటల నిరంతర ఆపరేషన్‌లో రోయెన్ ఓడను రక్షించడం ద్వారా వాణిజ్య నౌకలను హైజాక్ చేయాలనే సోమాలి సముద్రపు దొంగల ప్రణాళికలను భారత నావికాదళం విఫలం చేసింది. ఐఎన్ఎస్ కోల్‌కతా, 40 గంటల్లో, సమన్వయ చర్యల ద్వారా మొత్తం 17 మందిని సురక్షితంగా సురక్షితంగా రక్షించినట్లు భారత నావికాదళం ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అంతేగాక, సముద్రపు దొంగలను బందీలుగా పట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+