Ukrain: వరద నీటిలో ఖేర్సన్.. 8 మంది గల్లంతు..!
ఉక్రెయిన్ ఖేర్సన్‌లోని కఖోవ్కా హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ డ్యామ్ ధ్వంమవడంతో దక్షిణ ఉక్రెయిన్‌లోని వేలాది మంది ప్రజలు తీవ్ర ఎదుర్కొంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున డ్యామ్ ను పేల్చివేయడంతో నది పరీవాహక ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి.
యునైటెడ్ నేషన్స్ ఎమర్జెన్సీ రిలీఫ్ కోఆర్డినేటర్, మార్టిన్ గ్రిఫిత్స్ డ్యామ్ కూల్చివేత, ప్రజల ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేశాయి.
ఉక్రెయిన్ ప్రజలు ఇప్పుడు మరింత దారుణమైన దుస్థితిని ఎదుర్కొంటున్నారని గ్రిఫిత్స్ హెచ్చరించారు. ఖెర్సన్‌లోని 40 స్థావరాలు ఇప్పటికే నీటితో నిండిపోయాయని చెప్పారు. పలు గ్రామాలు, పట్టణాలు వరద నీటిలోనే ఉన్నాయి. వ్యవసాయానికి అంతరాయం కలగడంతో పాటు పశువులు నీటిలో మునిగి చనిపోతున్నాయి. వరదలు ఖేర్సన్ ప్రాంతంలోని 60 వేల మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోన్నాయి.

వరదలతో వేల హెక్టర్లలో పంట నష్టం వాటిల్లింది. వరదల తర్వాత నీటి లభ్యత లేకుంటే పంట సాగు కూడా కష్టమేనని అక్కడి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి, మానవతావాద సంస్థలు ఈ విపత్తు నుంచి ప్రజలను రక్షించడానికి తమ ప్రయత్నాలను వేగవంతం చేశాయి. ఆనకట్ట విధ్వంసం చుట్టూ ఉన్న పరిస్థితులకు సంబంధించిన సమాచారం సరిగా లేనప్పటికీ, ఈ సంస్థలు సుమారు 16,000 నుంచి 20,000 మంది బాధితులకు తక్షణ సహాయం అందించాయి.
ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. రిజర్వాయర్ నుంచి ఎక్కువ నీటిని బయటకు పంపితే దీర్ఘకాలిక పరిణామాలను తోసిపుచ్చలేమని చెప్పింది. కఖోవ్కా డ్యామ్‌ను ధ్వంసం చేయడానికి ఎవరు బాధ్యత వహిస్తారనేది అస్పష్టంగా ఉన్నప్పటికీ, యుద్ధంలో నీటిని ఆయుధంగా మార్చడం చరిత్రలో పునరావృతమయ్యే అవకాశం ఉందని ప్రఖ్యాత వ్యూహకర్త, రచయిత బ్రహ్మ చల్లానీ ట్వీట్ చేశారు.
1943లో జర్మనీ మోహ్నే డ్యామ్‌పై బ్రిటిష్ బాంబు దాడి చేసింది. దాని ఫలితంగా వినాశకరమైన ఆకస్మిక వరదలు వచ్చాయి. కొరియన్, వియత్నాం యుద్ధాల సమయంలో డ్యామ్‌లపై బాంబు దాడి జరిగింది. 1990లో అమెరికా నేతృత్వంలోని బలగాలు బాగ్దాద్ నీటి సరఫరా నెట్‌వర్క్‌పై బాంబు దాడి చేసిన విషయాన్ని కూడా చలానీ ప్రస్తావించారు. వరదలో 8 మంది గల్లంతయినట్లు స్థానిక వార్త సంస్థలు పేర్కొంటున్నాయి.












Click it and Unblock the Notifications