వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

90 రోజుల్లో టిక్‌టాక్‌ బ్యాన్: కోర్టుకెక్కిన బైట్‌డాన్స్: కొత్త ప్రభుత్వం నిర్ణయమేంటీ?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అవుట్ గోయింగ్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అధికారంలో ఉన్నప్పుడు జారీ చేసిన ఆదేశాలు, ఉత్తర్వులపై వివాదాలు రేపుతున్నాయి. ఇక్కట్లను తెచ్చిపెడుతున్నాయి. చైనాకు చెందిన టాప్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను నిషేధించేలా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ ఆదేశాలపై టిక్‌టాక్‌ యాప్ యాజమాన్యం బైట్‌డాన్స్ కోర్టుకెక్కింది. అక్కడి న్యాయస్థానంలో అప్పీల్ చేసింది.

90 రోజుల్లో బ్యాన్ కోసం ఆదేశాలు..

90 రోజుల్లో బ్యాన్ కోసం ఆదేశాలు..

90 రోజుల్లో టిక్‌టాక్‌ వీడియో షేరింగ్ యాప్‌ను ఉపసంహరించుకోవాలంటూ ఇదివరకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బైట్‌డాన్స్ యాజమాన్యానికి ఆదేశాలను జారీ చేసింది. ఆగస్టు 14వ తేదీన ప్రభుత్వం ఈ ఉత్తర్వులను ఇచ్చింది. మూడు నెలల గడువు విధించింది. ఈ ఆదేశాల ప్రకారం.. మంగళవారం 90 రోజులు పూర్తవుతాయి. గడువు ముగిసే రోజే బైట్‌డాన్స్ సంస్థ యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయం చేయాలంటూ పిటీషన్‌ను దాఖలు చేసింది. విదేశీ సంస్థకు కల్పించిన హక్కుల్లో భాగంగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొంది.

గడువు పెంచాలని కోరినా..

గడువు పెంచాలని కోరినా..

టిక్‌టాక్‌ను ఉపసంహరించుకోవడానికి తమకు మరింత సమయం కావాలంటూ ఇదివరకే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశామని, దీనికి ఎలాంటి స్పందనా రాలేదని పేర్కొంది. నిర్దేశిత గడువు కంటే 30 రోజులు అదనంగా కావాలని తాము విజ్ఙప్తి చేశామని వెల్లడించింది. దీనికి ప్రభుత్వం నుంచి తమకు బదులు రాలేదని, గడువు పెంచుతారా? లేదా? అనేది తెలియజేయాలని కోరినా స్పందించ లేదని బైట్‌డాన్స్ తన పిటీషన్‌లో పేర్కొంది. తాము సూచించిన ప్రత్యామ్నాయాల పట్ల కూడా ట్రంప్ ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

ప్రతివాదుల లిస్ట్‌లో ట్రంప్..

ప్రతివాదుల లిస్ట్‌లో ట్రంప్..

గడువు ముగిసేంత వరకూ తమకు ఎలాంటి పొడిగింపు అనుమతులు రాలేదని, దీనితో తమ ప్రాథమిక హక్కులను పరిరక్షించుకోవడంలో భాగంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు వెల్లడించింది. ఇందులో ప్రతివాదులుగా డొనాల్డ్ ట్రంప్, అటార్నీ జనరల్ విలియమ్ బార్ర్, ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ నుచిన్, అమెరికాలో విదేశీ పెట్టుబడులను పర్యవేక్షించే కమిటీ (సీఎఫ్ఐయూఎస్), విదేశీ పెట్టుబడుల్లో జాతీయ భద్రతా వ్యవహారాల అంశాన్ని ఆరా తీయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంటర్ ఏజెన్సీ ప్యానెల్‌ను చేర్చిందా సంస్థ యాజమాన్యం.

Recommended Video

TikTok, Wechat పై నిషేధం విధించిన US.. వచ్చే ఆదివారం నుంచి డౌన్‌లోడ్‌లు నిలిపివేత!!
జాతీయ భద్రత కారణాన్ని చూపుతు..

జాతీయ భద్రత కారణాన్ని చూపుతు..

లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం అనంతరం భారత్.. టిక్‌టాక్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. అమెరికా కూడా ఇదే తరహా ఆదేశాలను జారీ చేసింది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని టిక్‌టాక్‌ను 90 రోజుల్లోగా ఉపసంహరించుకోవాలంటూ ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ గడువు ముగుస్తోన్న రోజే టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డాన్స్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై కొత్తగా ఏర్పడబోతోన్న జో బిడెన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.

English summary
ByteDance, the Chinese parent company of video-sharing app TikTok, filed a petition late on Tuesday with a U.S. Appeals Court challenging a Trump administration order set to take effect on Thursday requiring it to divest TikTok.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X