ప్రపంచంలోనే అతిపెద్ద పిజ్జా: 2కిలోమీటర్ల పొడవుతో రికార్డ్ బ్రేక్

Subscribe to Oneindia Telugu

లాస్‌ఏంజెల్స్: అమెరికాలోని తూర్పు లాస్ఏంజెల్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద పిజ్జాను తయారు చేశారు. ఇది సుమారు 2కిలోమీటర్ల పొడవు ఉండటం గమనార్హం. ఇటలీలో గత సంవత్సరం నమోదైన రికార్డును ఈ పిజ్జా బద్దలు కొట్టింది.

ఫంటానా కాలిఫోర్నియా ఆటో క్లబ్ స్పీడ్‌వేలో పదుల సంఖ్యలో చెఫ్‌లు, ప్రజలు పాల్గొని ఈ పిజ్జాను తయారు చేశారు. 1.93కిలోమీటర్ల(6,333ఫీట్లు) పొడవుతో దీన్ని తయారు చేశారు. దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పిజ్జాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ ప్రతినిధులు గుర్తించారు.

California chefs make the world's longest pizza stretching 6,333 ft!

కాగా, ఈ పిజ్జా మొత్తం బరువు 7,808కిలోలు. ఈ పిజ్జా తయారు చేయడానికి 3,632కిలోల రొట్టెల పిండి, 1,634కిలోల ఛీజ్, 2,542కిలోల సల్సా సాస్ ఉపయోగించారు. గత సంవత్సరం ఇటలీలో 6,082ఫీట్ల పొడవుతో రూపొందించి ప్రపంచ రికార్డు సృష్టించగా.. 6,333ఫీట్లతో తయారు చేసి ఆ రికార్డును బ్రేక్ చేశారు.

8గంటలపాటు నిరంతరంగా శ్రమించి ఈ పిజ్జాను తయారు చేశారు. హ్యామానిటీ అండ్ ఫ్రెండ్‌షిప్ ఈ కార్యక్రామన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన మొత్తాన్ని స్థానిక ఫుడ్ బ్యాంక్స్, నిరాశ్రయులకు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A pizza almost two km long, made in east of Los Angeles, became the world's longest as it exceeded the previous record set in Italy last year.
Please Wait while comments are loading...