ఆన్ లైన్ లో అప్పు తీసుకున్న ఉగ్రవాద జంట
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్పులకు పాల్పడిన దంపతులు దాడులు చెయ్యక ముందు ఆన్ లైన్ ద్వారా భారీ మొత్తంలో అప్పు తీసుకున్నారని అమెరికా ఎఫ్ బీఐ అధికారులు ప్రకటించారు.
దాడులకు రెండు వారాల ముందుగా ఆన్ లైన్ లో రుణాలు మంజూరు చేసే ఓ సంస్థ ద్వారా సుమారు రూ. 20 లక్షలు అప్పు తీసుకున్నారని ఎఫ్ బీఐ అధికారుల విచారణలో వెలుగు చూసింది. అయితే ఆ నగదు ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించినట్లు ఇప్పటి వరకు ఆధారాలు లేవని అధికారులు అంటున్నారు.

సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ (28), తప్ఫీన్ మాలిక్ (27) దంపతులు గత వారంలో కాలిఫోర్నియాలో కాల్పులు జరిపి 14 మందిని అంతం చేశారు. తరువాత భద్రతా దళాలు జరిపిన కాల్పులలో ఉగ్రవాద దంపతులు ఇద్దరూ అంతం అయ్యారు.
అంతకు ముందే రిజ్వాన్ ఫరూక్ ఆన్ లైన్ లో అప్పు తీసుకుని అతని బ్యాంకు అకౌంట్ లో డిపాజిట్ చేసుకున్నాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది. అయితే వీరు ఉగ్రవాద కార్యకలాపాల కోసం రుణం తీసుకున్నారా, భవిష్యత్తు అవసరాల కోసం తీసుకున్నారా అని అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications