కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన కాంబోడియా..!
కంబోడియా - థాయిలాండ్ మధ్య సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కంబోడియా తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. తమ లక్ష్యం శాంతియుత పరిష్కారమని.. వివాదాలను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించాలనే స్పష్టం చేసింది.
తాజా లెక్కల ప్రకారం, కంబోడియాలో 13 మంది, అందులో 8 మంది సైనికులు మరణించారు. 35,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి తాత్కాలిక శిబిరాలకు తరలివెళ్లారు. థాయిలాండ్‌లో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 46 మంది గాయపడ్డారు. ఘర్షణల కారణంగా సరిహద్దు ప్రాంతాల నుంచి 1.38 లక్షల మందికి పైగా ప్రజలు భద్రతా ప్రాంతాలకు తరలించబడ్డారు.

ఈ ఘర్షణలకు ప్రధానంగా ప్రెయా విహార్, ప్రసాత్ తా మ్యూన్ థామ్ దేవాలయాల పరిసర ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. ఇరు దేశాలు పరస్పరం రాకెట్లు, ఫిరంగి దాడులు చేసుకోవడంతో సరిహద్దు ప్రాంతాలు యుద్ధభూమిగా మారాయి. 11వ శతాబ్దంలో నిర్మించబడిన ప్రెయా విహార్ హిందూ దేవాలయం చారిత్రకంగా, భౌగోళికంగా ప్రాముఖ్యం కలిగినది. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ దేవాలయంపై కంబోడియా సార్వభౌమత్వాన్ని ధృవీకరించినప్పటికీ, సరిహద్దు రేఖల స్పష్టత లేకపోవడం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ ఘర్షణలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. థాయిలాండ్, కంబోడియా అనవసరమైన దాడులు చేస్తున్నట్లు ఒకరినొకరు ఆరోపించుకున్నాయి. థాయిలాండ్ రాయబారి కంబోడియా నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తోందని ఆరోపించగా, కంబోడియా రాయబారి దీనిని ఖండిస్తూ తాము "అత్యధిక సంయమనం పాటిస్తున్నాం" అని స్పష్టం చేశారు.
ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఎప్పటి నుంచో నడుస్తుంది. 2008 నుండి 2011 మధ్య ప్రెయా విహార్ పరిసరాల్లో పలు సార్లు ఘర్షణలు జరిగాయి. మే 2025లో ఒక కంబోడియా సైనికుడుని హతమార్చడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని భావిస్తున్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications