తరిమికొట్టడం అంటే అదేనయా..! కారోనాను జయించిందయా..!కంబోడియా..!!
హైదరాబాద్ : ఔను.. ఆదేశం యుద్దం చేసింది. రణభూమిలో అద్బుత విజయం సాధించింది. అరుదైన విజయాన్ని ప్రపంచ దేశాలముందు స్పూర్తిగా నిలిపింది. యస్.. దాదాపు 15కోట్ల జనాబా ఉన్న కంబోడియా దేశం కరోనాను తరిమికొట్టింది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కంబోడియా కృతనిశ్చయం ముందు కుదేలయ్యింది. ఆ దేశ ప్రజల పట్టుదలను చూసి పరారయిపోయింది.
దీంతో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా కంబోడియా చేసిన పోరాటం గురించి తెలుసుకోవాలని ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. అంతే కాకుండా కరోనా మహమ్మారి మీద సాధించిన అరుదైన విజయం పట్ల తోటి దేశాలు కంబోడియా దేశాన్ని ప్రశంసిస్తున్నాయి. కరోనా వైరస్ మీద విజయం సాదించాలంటే కంబోడియా దేశం అనుసరించిన విధానాలను ఆచరణలో పెట్టాలని సభ్య దేశాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రపంచంలో కరోనా లేని దేశంగా కంబోడియా అవతరించింది. ఆ దేశంలో కేవలం నూటా ఇరవై రెండు కేసులు మాత్రమే నమోదు కాగా, వైరస్ బారిన పడ్డ ప్రతిఒక్కరు కూడా కోలుకున్నారు. ఏ ఒక్క మరణం కూడా సంభవించ లేదు. దీంతో తమ దేశం కరోనా రహిత దేశంగా మారిందని కంబోడియా ఆరోగ్యశాఖ మంత్రి సగర్వంగా ప్రకటించారు. లాక్‌డౌన్ ఆంక్షలను మాత్రం ఎత్తివేసేది లేదని వివరించారు.
సరిహద్దులతో పాటు పోర్టులు, చెక్ పోస్టులు, విమానాశ్రయాలు మూసివేసినట్లు తెలిపారు. అయితే, గత నెల రోజులుగా అక్కడ ఒక్క కొత్త కరోనా కేసు నమోదు కాలేదని మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా కొనసాగుతున్నా వీటి జోరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగ్గంటట్టో ఐదు వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కంబోడియా పై మాత్రం కన్నెత్తి చూడడానికి కరోనా భయపడిపోతున్నట్టు స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications