షాకింగ్ : పార్లమెంట్ వర్చువల్ సమావేశాల్లో నగ్నంగా ఎంపీ... ఒంటిపై నూలుపోగు లేకుండా...

కెనడాకు చెందిన ఎంపీ ఒకరు వర్చువల్ పార్లమెంట్ సమావేశాల్లో నగ్నంగా కనిపించి అందరికీ షాకిచ్చారు. అయితే ఇది పొరపాటున జరిగిందని... ల్యాప్‌టాప్ కెమెరా ఆన్‌లో ఉందని గ్రహించక అదే గదిలో బట్టలు మార్చుకున్నానని చెప్పారు. ఎంపీ వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఆయన నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కెనడాలోని క్యూబెక్ జిల్లా పాంటియాక్ నియోకజవర్గానికి చెందిన ఎంపీ విలియమ్ ఆమోస్ ఇలా నగ్నంగా జూమ్‌ వీడియో కాల్‌లో కనిపించారు. ఆ సమయంలో ఆయన చేతిలో సెల్‌ఫోన్ తప్ప ఒంటిపై నూలుపోగు లేదు.నిజానికి తాను అప్పుడే జాగింగ్‌కి వెళ్లి వచ్చానని... పార్లమెంట్ వర్చువల్ సమావేశంలో పాల్గొనేందుకు దుస్తులు మార్చుకుంటున్నాని ఎంపీ విలియమ్ చెప్పారు. అయితే అప్పటికే తన ల్యాప్‌ట్యాప్ కెమెరా ఆన్‌లో ఉందన్న విషయాన్ని తాను గ్రహించలేదని చెప్పారు. జరిగిన పొరపాటుకు హౌస్ సభ్యులందరికీ క్షమాపణలు తెలియజేశారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదని చెప్పారు.

ప్రతిపక్ష నేత క్లాడ్ డెబెల్లెఫ్యూల్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు వర్చువల్‌గా జరుగుతున్నందునా... హౌస్ సభ్యులు సరైన దుస్తులు ధరించి అందులో పాల్గొనాలని సూచించారు. ముఖ్యంగా పురుషులకు దీని గురించి గుర్తుచేస్తున్నట్లు చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో ఒక సభ్యుడు నగ్నంగా కనిపించడం ఒక కొత్త రికార్డు సృష్టించడమేనని ఎద్దేవా చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దీనిపై స్పందించలేదు.

Canadian MP accidentally Appears Naked on Parliament Zoom Call

కొద్దిరోజుల క్రితం సౌతాఫ్రికాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎన్దేవూ అనే నేత పార్లమెంట్ జూమ్ సమావేశాల్లో పాల్గొనగా.. ఆయన సతీమణి నగ్నంగా ఆ గదిలోకి వచ్చింది. దీంతో ఆ సమావేశంలో పాల్గొన్నవారంతా షాకయ్యారు. వెంటనే ఆ సమావేశాన్ని నిలిపివేశారు. అనుకోని ఈ సంఘటనకు ఎన్దేవూ క్షమాపణలు తెలియజేశారు.

కాగా,కరోనా నేపథ్యంలో చాలా దేశాల్లో ప్రభుత్వ,ప్రైవేట్ సమావేశాలు వర్చువల్‌గా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు అనుకోని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సమావేశాల్లో పాల్గొనే నేతలు,అధికారులు పొరపాటున ల్యాప్‌టాప్ కెమెరా ఆఫ్ చేయడం మరిచిపోవడం వల్ల వారి ప్రైవేట్ వ్యవహారమంతా అందులో రికార్డవుతోంది. కాబట్టి జూమ్ సమావేశాల్లో పాల్గొనేవారు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+