ట్రంప్ జోక్యం విఫలం: 45 రోజుల్లోపే ఆసియాలో మరో యుద్ధం!

తాజాగా ప్రపంచంలో మరో యుద్ధం మొదలైంది. ఈ సారి థాయ్‌లాండ్, కంబోడియా దేశాలు ముఖాముఖి తలపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం 45 రోజుల్లోనే విచ్ఛిన్నం కావడం గమనార్హం. గత రెండ్రోజులుగా ఇరు దేశాల సరిహద్దుల్లో కాల్పులు, ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో థాయ్‌లాండ్ సరిహద్దుకు ఎఫ్-16 ఫైటర్ జెట్లను మోహరించింది. సరిహద్దుల్లోని నగరాలను ఖాళీ చేయించింది. థాయ్‌లాండ్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ డిసెంబర్ 8వ తేదీ ఉదయం కంబోడియాపై వైమానిక దాడులు కూడా చేసింది.

కంబోడియాపై దాడులకు రెచ్చగొట్టారనే ఆరోపణ
థాయ్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ వింథాయ్ మాట్లాడుతూ.. వైమానిక దాడులు చేయడానికి కంబోడియానే రెచ్చగొట్టిందని ఆరోపించారు. డిసెంబర్ 7 ఆదివారం నాడు, కంబోడియా సైనికులు థాయ్‌లాండ్‌లో సిసాకేట్ స్టేట్‌లోని కంథారాలక్ జిల్లాలోని ఫూ ఫా లేక్-ప్లాన్ హిన్ పైట్ కోన్ ప్రాంతంలో దాడి చేశారు. నిబంధనల ప్రకారం థాయ్ సైన్యం ఈ దాడికి దీటుగా సమాధానం ఇచ్చింది. డిసెంబర్ 8, సోమవారం ఉదయం ఉబోన్ రాచాథాని ప్రావిన్స్‌లోని నామ్ యుఎన్ జిల్లాలోని చోంగ్ ఆన్ మా ప్రాంతంలో సరిహద్దు ఘర్షణలు, వైమానిక దాడులు జరిగాయి.

Ceasefire Collapses in 45 Days Thailand Cambodia War Reignites Despite Trump Intervention

సరిహద్దులో బలగాలు, ఆయుధాల మోహరింపు
రాయల్ థాయ్ ఎయిర్ ఫోర్స్ (RTAF) ప్రతినిధి ఎయిర్ మార్షల్ జాక్రిట్ థమ్మావిచాయ్ ప్రకారం.. కంబోడియా సైనికులు ఉదయం 5:05 గంటల ప్రాంతంలో చిన్న ఆయుధాలు, ఇండైరెక్ట్-ఫైర్ ఆయుధాలతో కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు ఒక థాయ్ సైనికుడు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఈ క్రమంలో థాయ్‌లాండ్ సురానారి టాస్క్ ఫోర్స్‌తో కలిసి కంబోడియాపై వైమానిక దాడి చేసింది. కంబోడియా సైన్యం కూడా సరిహద్దుల్లో పోరాట బలగాలను మోహరించి, వారికి రవాణా సౌకర్యాలతో పాటు భారీ ఆయుధాలను సరఫరా చేసింది. ఇది యుద్ధానికి సన్నద్ధతగా పరిగణించవచ్చు.

మళ్లీ రగిలిన సరిహద్దు వివాదం
థాయ్‌లాండ్, కంబోడియా దేశాల మధ్య పాత సరిహద్దు వివాదం జులై 2025లో మళ్లీ రాజుకుంది. దాని కారణంగా ఇరు దేశాల మధ్య 5 రోజుల పాటు యుద్ధం జరిగింది. అప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంలు జోక్యం చేసుకుని కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చారు. అక్టోబర్ 2025లో కౌలాలంపూర్‌లో ఇరు దేశాల ప్రతినిధులను ముఖాముఖి కూర్చోబెట్టి చర్చలు జరిపి, ఒక పెద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా కుదిర్చారు. అయితే ఆ ఒప్పందం 2 నెలల్లోపే విచ్ఛిన్నమై యుద్ధం మళ్లీ మొదలైంది.

శివాలయం, సరిహద్దులే వివాదానికి కారణం
థాయ్‌లాండ్, కంబోడియా మధ్య సరిహద్దులో ఉన్న పురాతన ఖైమర్ దేవాలయాలైన ప్రీత్ విహార్, ప్రసాత్ తా ముయెన్ థమ్, ప్రసాత్ తా క్రబేలకు సంబంధించి ఈ వివాదం కొనసాగుతోంది. 19వ-20వ శతాబ్దాలలో తయారు చేయబడిన వలసవాద మ్యాప్‌లలో ఈ ప్రాంతం కంబోడియాలో భాగంగా చూపబడింది. అయితే థాయ్‌లాండ్ వీటిని తమ భూభాగంగా పేర్కొంటూ హక్కును చెబుతోంది. ఈ సరిహద్దు వివాదం కారణంగానే జులై 2025లో ఘర్షణలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇరు దేశాలు పరస్పరం వ్యాపారం, దిగుమతి-ఎగుమతి, పర్యాటకంపై నిషేధం విధించాయి. అంతేకాకుండా ఇరు దేశాలు తమ రాయబారులను, దౌత్యవేత్తలను కూడా వెనక్కి పిలిపించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+