• search

కేరళ వరదలు: యూఏఈ రూ.700 కోట్ల సాయానికి కేంద్రం నో! ఎందుకు వద్దంటోంది?

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   యూఏఈ కేరళకు సహాయం చేయడం వెనుకు ఉన్న ఆంతర్యమేమిటి???

   తిరువనంతపురం/న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు యూఏఈ (యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్) రూ.700 కోట్లు (100 మిలియన్ డాలర్లు) సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవచ్చునని తెలుస్తోంది.

   కేరళకు యూఏఈ రూ.700 కోట్ల సాయం: 10ని.ల్లో జెండా ఎగురవేస్తారనగా.. యువతి కంటతడి

   కేరళ వరద బాధితులకు యూఏఈతో పాటు ఖతార్, మాల్దీవ్స్ తదితర దేశాలు కూడా అండగా నిలిచేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఆఫర్ల పట్ల భారత దేశం వారికి కృతజ్ఞతలు చెప్పడమే కానీ, ఆ మొత్తాన్ని అంగీకరించకపోవచ్చునని చెబుతున్నారు.

   Centre Unlikely to Accept UAEs Rs 700 Crore Flood Relief Offer for Kerala

   ఆ నిధులను అంగీకరించకుంటే ఇదే మొదటిసారి కూడా కాదు. గత ప్రభుత్వాలు కూడా ఇలాగే వ్యహరించాయి. 2007లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇతర దేశాలు లేదా మల్టీ నేషనల్ కంపెనీల సహాయాన్ని దేశం అంగీకరించడం లేదని చెబుతున్నారు. ఇప్పటి ప్రభుత్వం కూడా దానినే అనుసరించవచ్చునని అంటున్నరు.

   ఉత్తరాఖండ్‌, కాశ్మీర్‌లో వరదలు వచ్చినప్పుడు ఇతర దేశాల ఫండ్స్‌ను కేంద్రం తిరస్కరించింది. 2013లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్‌కు రష్యా సహాయం చేస్తామని ముందుకు వచ్చిందని, కానీ నాటి ప్రభుత్వం దీనిని తిరస్కరించిందని చెబుతున్నారు.

   యూఏఈ పీఎం షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ కేరళ వరద సాయం రూ.700 కోట్లు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఖతార్ రూ.35 కోట్లు, మాల్దీవ్స్ 50వేల డాలర్లు ఇస్తామని చెప్పింది. నాడు యూపీఏ ప్రభుత్వం ఇలాంటి సహాయాన్ని నిరాకరించింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందని చెబుతున్నారు.

   విదేశీ నిధులను తీసుకోవడంపై కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ ఏం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై చర్చ సాగుతోంది. మరోవైపు, యూఏఈ సహాయంపై కేరళ సీఎం పినరాయి విజయన్ ఆ దేశానికి థ్యాంక్స్ మీద థ్యాంక్స్ చెబుతున్నారు. విదేశీ సాయం వెనుక వేరే అంశాలు ఉంటాయని, అందుకే వాటిని నిరాకరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి.

   కేరళ సీఎం పినరయి విజయన్‌ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యూఏఈ యువరాజు డిప్యూటీ సుప్రీం కమాండర్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యన్‌ భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారని, రాష్ట్రానికి తాము అందించే సాయం గురించి తెలిపారని చెప్పారు. యువరాజుకు విజయన్‌ కృతజ్ఞతలు తెలిపారు. కేరళకు, యూఏఈతో ప్రత్యేక బంధముందని, మలయాళీలకు అది మరో ఇల్లు లాంటిదని ట్విట్టర్లో పేర్కొన్నారు.

   కాగా, యూఏఈలో పనిచేసే భారతీయుల్లో దాదాపు 80 శాతం కేరళకు చెందినవారే ఉన్నారు. మాల్దీవులు ప్రభుత్వం కేరళకు 50వేల డాలర్లు (రూ.35లక్షలు) సాయం ఆఫర్‌ చేసింది. ఐక్యరాజ్య సమితి కూడా సాయాన్ని ప్రకటించే అవకాశముంది. కానీ భారత్‌ వీటిని అంగీరించకపోవచ్చని సమాచారం.

   .

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   The government is unlikely to accept any foreign financial assistance for flood relief operations in Kerala, official sources said on Tuesday, which would rule out UAE's generous aid offer of Rs 700 crore for the state.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more