వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్లుడికే షాకిచ్చిన ట్రంప్ వీసా నిబంధనలు: సోదరి అసంతృప్తి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన వీసా నిబంధనలు అమెరికాకు వచ్చే ప్రవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ నిబంధనలు సొంత అల్లుడు జారెద్ కుష్నర్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన వీసా నిబంధనలు అమెరికాకు వచ్చే ప్రవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ నిబంధనలు సొంత అల్లుడు జారెద్ కుష్నర్ (ట్రంప్ కూతురు ఇవాంకా భర్త)కే చిక్కులు తెచ్చి పెట్టాయి.

కొత్త సమస్యలు..

కొత్త సమస్యలు..

ప్రస్తుతం జారెద్ కుష్నర్ వైట్ హౌజ్ సలహాదారుగా పనిచేస్తున్నారు. ట్రంప్ తెచ్చిన వీసా విధానాలు కుష్నర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీకి కొత్త సమస్యలు తెచ్చిపెడుతుండటం గమనార్హం. కుష్నర్.. కంపెనీ ఫెడరల్ వీసా ప్రోగ్రాంను ఉపయోగిస్తోంది.

నిబంధనలు వర్తిస్తాయి..

నిబంధనలు వర్తిస్తాయి..

ఈ కంపెనీ న్యూజెర్సీలోని రెండు లగ్జరీ టవర్న్‌కు చైనా ఇన్వెస్టర్ల నుంచి 150మిలియన్ డాలర్లు తీసుకుంది. అయితే, ఫెడరల్ వీసా విధానంలో ఈబీ-5 ప్రోగ్రాం ద్వారా విదేశీయులు కనీసం 5లక్షల డాలర్ల పెట్టుబడులు పెడితే వీసాను సులభంగా పొందవచ్చు. దీన్నే ‘వీసా ఫర్ క్యాష్' అని కూడా కొందరు పిలుస్తుంటారు.

పెట్టుబడులకు గండి..

పెట్టుబడులకు గండి..

ఇప్పుడు వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ఈబీ-5 ప్రోగ్రాంలో మార్పులు జరగనున్నాయి. దీంతో కుష్నర్ కంపెనీ పెట్టుబడులను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయంపై కుష్నర్ సోదరి నికోలే అసంతృప్తి వ్యక్తం చేశారు.

జోక్యం చేసుకోని కుష్నర్

జోక్యం చేసుకోని కుష్నర్

అయితే, కుష్నర్ గానీ, ఆయన కంపెనీ గానీ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. వీసా నిబంధనల్లో కూడా కుష్నర్ జోక్యం చేసుకోలేదని వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి. అయితే, ట్రంప్ తీసుకొస్తున్న కొత్త నిబంధనలు అమెరికాకు భవిష్యత్‌లో మేలు చేసేవిగానే ఉంటాయని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు.

English summary
Changes to a controversial visa program under consideration by the Trump administration could hurt a real estate project partially owned by the family of White House adviser Jared Kushner, the president's son-in-law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X