సిరియా బాలుడికి పాలస్తీనియన్ల నివాళి: 'పట్నాయక్' సైతం
న్యూఢిల్లీ: కొన్ని రోజుల కిందట టర్కీ పర్యాటక ప్రాంతం బోడ్రమ్ బీచ్‌కు చనిపోయి కొట్టుకొచ్చిన సిరియా బాలుడు అయిలన్ కుర్దీకి పాలస్తీనియన్లు నివాళులర్పించారు. గాజా బీచ్‌లో 30 మంది పాలస్తీనియన్లు బాలుడి మృతి స్థితిని గుర్తుకు తెస్తూ ఎర్రని టీషర్ట్ లు, నీలంరంగు ప్యాంట్లు ధరించి ముఖాన్ని కిందకు ఉంచుతూ దాదాపు 20 నిమిషాల పాటు ఇసుకలో బోర్లా పడుకున్నారు.
సిరియా నుంచి యూరప్‌కు పడవలో వలస పోతూ ప్రాణాలు పోగొట్టుకున్న మూడేళ్ల పసికందు ఫోటో సిరియా శరణార్ధుల సమస్యపై యావత్ ప్రపంచం దృష్టిన ఆకర్షించింది. అంతేకాదు యూరోపియన్ దేశాలు వ్యవహరిస్తున్న దమననీతికి, సిరియా శరణార్ధుల దుర్భరస్ధితికి ఈ చిత్రం అద్దం పట్టింది.

బాలుడి ఘటనకు సంతాపంగా గాజా బీచ్ లో సైకత శిల్పులు బాలుడి సైకతశిల్పాన్ని రూపొందించారు. ఆ శిల్పానికి కొద్ది అడుగుల దూరంలోనే ఈ రోజు పాలస్తీనియన్లు ఘనంగా నివాళులర్పించారు. ఈ ఫోటో అనంతరం ప్రపంచ దేశాలు వలస సంక్షోభ పరిష్కారానికి సమాయత్తమయ్యాయి.
శరణార్ధులకు మేము ఆశ్రమం ఇస్తామంటూ ఐరోపా దేశాలు ముందుకొస్తున్నాయి. శరణార్ధులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్న వారికి అభినందనలు అంటూ సైకత శిల్పం కింద రాశాడు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మధ్యధరా సముద్రాన్ని దాటే క్రమంలో ఇప్పటివరకు 2,600 మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి నివేదికలు చెబుతున్నాయి.
My sand art at Puri beach,india on #AylanKurdi,appreciating the World community's effort to solve the #refugee crisis pic.twitter.com/NrUBtjog8v
— sudarsan pattnaik (@sudarsansand) September 7, 2015 











Click it and Unblock the Notifications