కాలింగ్ బెల్ కొడితే, బుల్లెట్ దూసుకొచ్చి చచ్చిపోయాడు..

Subscribe to Oneindia Telugu

మసాచుసెట్స్ : చుక్క లోపల పడిందంటే.. సెల్ఫ్ డైరెక్షన్ కు ఫుల్ స్టాప్ పడినట్టే. ఏం చేసినా..! ఏం మాట్లాడినా..! అంతా మందు డైరెక్షన్ లోనే. అదుపు తప్పడం, అతిగా ప్రవర్తించడం.. ఆ తర్వాత జరిగే పరిణామాలు. ఆ క్రమంలో ఓవర్ యాక్షన్ ఎక్కువైతే.. అసలు లైఫ్ యాక్షన్ కే తెరపడే ప్రమాదమూ లేకపోలేదు.

మసాచుట్స్ లోని చికోపీలో ఇదే తరహా వ్యవహారం చోటు చేసుకోవడంతో ఓ టీనేజర్ ప్రాణాలు కోల్పోయాడు. 15 ఏళ్ల వయసుండే ఓ టీనేజర్, శనివారం నాడు అతని స్నేహితుడితో కలిసి మధ్యం సేవించాడు. అనంతరం ఇద్దరు కలిసి సమీపంలోని అతని ఫ్రెండ్ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Chicopee shooting leaves

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఫ్రెండ్ ఇళ్లు అనుకొని వేరే ఇంటి తలుపు కొట్టడమే సదరు టీనేజర్ ప్రాణాలకు ముప్పు తెచ్చింది. తమ ఫ్రెండ్ ఇళ్లే అనుకొని లోవెల్ (42) అనే వ్యక్తి ఇంటి తలుపు కొట్టారు ఇద్దరు ఫ్రెండ్స్. మొదట తలుపు శబ్దమయినపుడు బాగానే స్పందించిన లోవెల్.. ఇద్దరు ఫ్రెండ్స్ గట్టిగా తలుపులు బాదడం.. ఓ అద్దం కూడా పగిలిపోవడంతో.. దొంగలేమోనని అనుమానించాడట.

దీంతో వెంటనే తన తుపాకీ తీసి టీనేజర్లపై కాల్పులు జరిపాడు లోవెజ్. ఈ ఘటనలో ఓ టీనేజర్ కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. హాంప్‌డెన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆంథోనీ డి. గుల్లు ఈ వివరాలు వెల్లడించారు. ఇదిలా ఉంటే, టీనేజర్ ప్రాణాలు తీసిన లోవెల్ కు నాన్ బెయిలబుల్ శిక్ష పడే అవకాశమున్నట్టు సమాచారం.

లోవెల్ ను విచారిస్తున్న పోలీసులు అతనికి తుపాకీ అంటే చాలా మోజు ఉన్నట్లు గుర్తించారు. అతని ఫేస్ బుక్ ఖాతాలోను తుపాకీ బొమ్మలే ఎక్కువగా ఉన్నాయట.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 15yearold boy shot in the abdomen Saturday has died and a 42-year-old homeowner has been arrested in his death.Jeffery Lovell, 42, 120 Boucher Circle, has been charged with murder. He is being held in the Chicopee Police Department jail without right to bail, Michael Wilk, public information officer for the Chicopee Police Department, said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X