వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పుడిదే హాట్ జాబ్: ఏడాదికి రూ.3కోట్లపైనే ప్యాకేజీ!

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఇటీవలి కాలంలో ఐటీ, ఎంఎన్సీ, మార్కెటింగ్, టెక్నాలజీ కంపెనీల్లో హాటెస్ట్ జాబ్ ఏంటంటే సీఎక్స్ఓ (చీఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్). సీఈఓలు, సీఎఫ్ఓలు, సీఎంఓ వంటి ఉన్నత పోస్టులు ఎన్నివున్నా సీఎక్స్ఓలకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. రీసెర్చ్ గార్ట్‌నర్ నివేదిక ప్రకారం.. గత సంవత్సర కాలంలో దాదాపు 20 సీఎక్స్ఓ పోస్టులు భర్తీ అయ్యాయి.

డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, మార్కెటింగ్, ఇన్నోవేషన్ పై కన్నేసిన కంపెనీలు, కేవలం ఒక్క విభాగంలో కాకుండా, సాధ్యమైనన్ని ఎక్కువ విభాగాల్లో అనుభవమున్న వారికి ప్రాధాన్యత ఇస్తూ, వారినీ ఈ పోస్టుకు తీసుకుంటున్నాయి.
ఇక వీరికి వేతనంగా ఏడాదికి రూ. 3.5 కోట్ల వరకూ లభిస్తోందని రీసెర్చ్ సంస్థ గార్ట్ నర్ వైస్ ప్రెసిడెంట్ గణేష్ రామ్మూర్తి తెలిపారు.

Chief digital officer becomes a much-in-demand role, 20 CXOs hired across India Inc in last 12 months

సీఈఓల స్థానంలో సీఎక్స్ఓలతో పాటు సీడీఓ (చీఫ్ డెవలప్ మెంట్ ఆఫీసర్లు)లకు డిమాండ్ పెరుగుతోందని, వీరికి కూడా సీఈఓలు, సీఎఫ్ఓలతో సమానంగా వేతనం, హోదా లభిస్తోందని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఇండియాలోని 20 శాతం కంపెనీలు సీడీఓల పేరిట ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నాయని, మిగతా కంపెనీలూ అదే దారిలో నడుస్తున్నాయని గార్ట్‌నర్ విడుదల చేసిన సీఐఓ సర్వే-2016 వెల్లడించింది.

కాగా, రిలయన్స్ తోపాటు ఆదిత్య బిర్లా గ్రూప్, మహీంద్రా, ఆర్పీజీ, రేమాండ్, బిర్లా సన్ లైఫ్, ఎల్అండ్ డీ తదితర కంపెనీలు కొత్తగా సీడీఓ, సీఎక్స్ఓలను నియమించుకున్నాయి. కాన్వోనిక్స్ మాజీ సీఈఓ విశాల్ సంపత్‌ను రిలయన్స్ జియో, హెచ్ఎస్బీసీ కమన్షియల్ బ్యాంకింగ్ హెడ్ రాజీవ్ రాయ్‌ని ఎడిల్ వైజస్ ఫైనాన్షియల్,టీసీఎస్ డిజిటల్ విభాగం అధిపతి రితీష్ అరోరా సియట్ టైర్లకు చీఫ్ డెవలప్ మెంట్ ఆఫీసర్లుగా చేరారు.

వీరితో పాటు ఇంకా ఎంతో మంది అన్ని విభాగాల్లో నైపుణ్యంతో తమ సత్తాను చాటేందుకు కొత్త సవాళ్లను స్వీకరిస్తున్నారని గార్ట్‌నర్ తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత కాలంలో సీఎక్స్ఓ జాబ్‌కు డిమాండ్ పెరుగుతోందని, పలు సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయని పేర్కొంది.

English summary
Atleast 20 CXOs have been hired across India Inc in the last 10-12 months to drive digital transformation, marketing and innovation, in a testimony to how companies are jostling for senior talent to compete in an environment of sweeping digital change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X