మళ్లీ గడువు: భారత్‌ను మరింత రెచ్చగొట్టేలా చైనా అడ్డుపుల్ల
జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా మరోసారి చైనా మోకాలాడ్డింది.
బీజింగ్: జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా మరోసారి చైనా మోకాలాడ్డింది.

15 దేశాల్లో 14 ఓకే చెప్పాయి, చైనా మాత్రం
మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గత సంవత్సరం మార్చిలో భారత్ చేసిన విజ్ఞప్తికి 15 దేశాల ఐక్య రాజ్య సమితి కమిటీలో 14 దేశాలు అంగీకరించాయి.

సాంకేతిక కారణాలతో అడ్డుపుల్ల
చైనా మాత్రం సాంకేతిక కారణాలు చూపిస్తూ అడ్డుకుంటోంది. ఆగస్టు 2వ తేదీన చైనా తన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆదేశాలు వచ్చాయి. ఆ తేదీ ముగియడానికి గంటల ముందే తమకు మరో మూడు నెలల సమయం కావాలని చైనా కోరింది.

మరింత రెచ్చగొట్టేలా చైనా తీరు
ఇప్పటికే భారత్-చైనా మధ్య డోక్లాం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత చైనా తీరు ఇరుదేశాల మధ్య విభేదాలను మరింత రెచ్చగొట్టే విధంగా ఉంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనంగా మారుతాయంటున్నారు. మసూద్ పైన ఇప్పటికే చైనా రెండుసార్లు గడువు కోరింది.

అమెరికా ముందుకొచ్చినా
ఈలోగా గడవు పూర్తవడంతో భారత్ దరఖాస్తు చెల్లకుండా పోయింది. దీంతో ఈసారి అమెరికా ముందుకొచ్చింది. ఐరాసలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా ప్రతిపాదన చేసింది. చైనా మళ్లీ అభ్యంతరం తెలిపింది. ఆరు నెలల పాటు గడువు కోరింది. ఆగస్టు 2తో ఆ గడువు పూర్తవడంతో మరోసారి మూడు నెలలపాటు వాయిదా కోరింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications