భారత్‌తో యుద్ధం వస్తే..: పాకిస్తాన్‌కు చైనా ఝలక్
బీజింగ్: పాకిస్తాన్‌కు దాని మిత్రదేశం చైనా షాకిచ్చింది. పాక్‌కు చైనా ఆప్తమిత్రుడిగా ఉన్న విషయం తెలిసిందే. అలాంటి చైనా ఇప్పుడు ఝలక్ ఇచ్చింది. భారత్‌తో యుద్ధం జరిగితే తాము పాక్‌కు సహకరిస్తామని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని సోమవారం స్పష్టం చేసింది.

పాకిస్తాన్‌కు చైనా షాక్
ఎవరైనా తమ పైన దాడి చేస్తే.. తమ వెంట పాక్ ఉందని పాకిస్తాన్ భావిస్తోంది. అయితే చైనా మాత్రం తనకు పట్టనట్లుగా ఉంది. తామేమీ అలా అనలేదే అంటూ దూరం జరగడానికి ప్రయత్నించింది. ఎవరైనా పాక్‌పై దాడికి వస్తే చైనా అండగా ఉంటుందని పాకిస్థాన్‌లో చైనా రాయబారిగా ఉన్న యూ బోరెన్ చెప్పినట్లు ఆ దేశ పత్రిక ది డాన్ కథనం ప్రచురించింది.

మాకు సంబంధం లేదని ఝలక్
అయితే బోరెన్ ఈ ప్రకటన చేసినట్లు తమకైతే తెలియదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇవాళ బీజింగ్‌లో వెల్లడించడం గమనార్హం. ఆయన ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో తమకైతే తెలియదని, కానీ కాశ్మీర్ అంశంపై తమ వైఖరి స్పష్టంగా ఉంది అని ఆ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

సంప్రదింపులతో కాశ్మీర్ సమస్యకు పరిష్కారం
కాశ్మీర్ అంశం చాలా ఏళ్లుగా అలా పెండింగ్‌లోనే ఉందని, ఈ వివాదాన్ని రెండు దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పారు. అది చర్చలు, సంప్రదింపులతోనే సాధ్యమవుతుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. వారం కిందట కూడా ఇలాగే చైనా తమకు అండగా ఉంటుందని ఆ దేశ ప్రధాని లీ కెకియాంగ్ తమ ప్రధాని షరీఫ్‌కు హామీ ఇచ్చారంటూ పాకిస్తాన్ మీడియా చెప్పుకుంది. కానీ చైనా మాత్రం ఈ వార్తలను ధృవీకరించలేదు.

మోడీపై అక్కసు
కాగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్ చౌదరి ఆరోపిస్తున్నారు. కొన్నాళ్లుగా మోడీ చేస్తున్న ప్రకటనలు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోకూడదనే ఐరాస నిబంధనలకు వ్యతిరేకమన్నారు. ఉగ్రవాద ఎగుమతిదారుగా పాక్ మారిందన్న మోడీ ఆరోపణని ప్రస్తావించిన ఆయన, కశ్మీర్ వివాద పరిష్కారంలో పాకిస్థాన్‌ను ఒక పక్షంగా ఐరాస పలు తీర్మానాల్లో గుర్తించిన విషయం తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు. భారత నాయకత్వం పాకిస్థాన్ పై నిందారోపణలు చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications