వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకు రుణం ఎగ్గొట్టారా.. అయితే ఇక అంతే!

బ్యాంకుల్లో అప్పు తీసుకుని ఎగ్గొట్టిన దాదాపు 60 లక్షల మంది విమానాలు ఎక్కి ఎక్కడికీ వెళ్లకూడదని, భవిష్యత్తులో వాళ్లకు రుణాలు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బీజింగ్: మన దేశంలో కాబట్టి.. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విజయ్ మాల్యా హాయిగా లండన్ చెక్కేశారుగానీ అదే చైనాలో అయితే మాత్రం ఇలా చేయడం ఆయనకు కుదిరేది కాదు.

ఎందుకంటే.. బ్యాంకుల్లో అప్పు తీసుకుని ఎగ్గొట్టిన దాదాపు 60 లక్షల మంది విమానాలు ఎక్కి ఎక్కడికీ వెళ్లకూడదని, భవిష్యత్తులో వాళ్లకు రుణాలు.. క్రెడిట్ కార్డులు ఇవ్వకూడదని, చివరికి ఉద్యోగాల్లో పదోన్నతులు కూడా ఇవ్వకూడదని అక్కడి అధికారులు స్పష్టం చేశారు.

చైనా సుప్రీంకోర్టు ఇలా బ్లాక్ లిస్ట్ చేసిన వారిలో దాదాపు 67.3 లక్షల మంది పౌరులు ఉన్నారు. ఇప్పటి వరకు 61.5 లక్షల మందిని విమాన టిక్కెట్లు కొనకుండా నిషేధించగా, 22 లక్షల మంది హైస్పీడ్ రైళ్లలో కూడా వెళ్లడానికి వీల్లేదని ఆదేశించారు.

China Bars 60 Lakh Bank Defaulters From Travelling, Getting Promotions

71 వేల మంది అయితే కార్పొరెట్ ప్రతినిదులుగా కానీ, ఎగ్జిక్యూటివ్ లుగా కానీ పనిచేయడానికి కుదరదు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ల ఐడీ కార్డు, పాస్ పోర్టుల సమాచారాన్ని విమానయాన సంస్థలు, రైల్వే కంపెనీలకు చైనా సుప్రీంకోర్టు అందజేసింది.

చైనాలోని అతిపెద్ద వాణిజ్య బ్యాంకులలో ఒకటైన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా దాదాపు లక్ష వరకు అప్పులు, క్రెడిట్ కార్డుల దరఖాస్తులను తిరస్కరించింది. వీళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, రాజకీయ సలహా కమిటీ సభ్యులు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సభ్యులు కూడా ఉన్నారు.

English summary
New Delhi: Vijay Mallya packed his bags, purchased a flight ticket and fled to London. This would have been much more difficult in China.The country has toughened restrictions on 60 lakh bank defaulters, barring them from flights, getting loans and credit cards or even promotions. There are 67.3 lakh Chinese citizens on the Chinese Supreme Court’s blacklist, Global Times reported, quoting the Meng Xiang, the head of the court’s enforcement bureau. So far, 61.5 lakh people have been barred from purchasing plane tickets and 22 lakh cannot travel by high-speed trains. Around 71,000 defaulters cannot serve as corporate representatives or executives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X