Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాక్‌కు భారత్ కౌంటరిస్తే.. చైనా మనకు షాకిస్తోంది!

బీజింగ్‌: చైనా మరోసారి భారత్‌పై వ్యతిరేక వైఖరిని, పాకిస్థాన్‌కు అండగా తాముంటామనే విషయాన్ని చాటుకుంది. పాక్‌పై భారత్‌ దూసిన 'సింధు'జలాల అస్త్రానికి చైనా 'బ్రహ్మాపుత్ర'స్త్రాన్ని అడ్డేసి కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు చైనాలో పుట్టి భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదీ జలాలకు అడ్టుకట్ట వేయనున్నట్లు ప్రకటించింది చైనా.

ఆసియాలో అన్ని రంగాల్లోనూ తనకు పోటీ వస్తున్న భారత్‌పై అక్కసు వెళ్లగక్కడానికి.. తన చిరకాల మిత్రదేశమైన పాకిస్థాన్‌కు మద్దతుగా నిలవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. టిబెట్‌లో బ్రహ్మపుత్ర (అక్కడ యార్లుంగ్‌ శాంగ్బో అని పిలుస్తారు)కు ప్రధాన ఉపనది అయిన 'జియాబుకు'కు వచ్చే నీటిని చైనా నిలిపివేసింది.

జిగేజ్‌ ప్రాంతంలో చేపడుతున్న భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. లాల్హో అని పిలిచే ఈ ప్రాజెక్టును 740 మిలియన్‌ డాలర్లు.. అంటే దాదాపు 9,700 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్నట్లు ఆ దేశ అధికార ప్రతినిధి ఝాంగ్‌ యాన్బావో తెలిపారు.

China blocks tributary of Brahmaputra in Tibet to build dam

మనకు నష్టమే

బ్రహ్మపుత్ర నీటిని నిలిపివేయడం వల్ల భారత్‌, బంగ్లాదేశ్‌ వంటి దిగువనున్న నదీ పరివాహక దేశాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎంతటి ప్రభావం ఉంటుందన్నది ఇంకా ఇతమిత్థంగా తెలియడం లేదు. గత ఏడాది చైనా టిబెట్‌లోనే అతిపెద్ద జామ్‌ జల విద్యుత్తు ప్రాజెక్టును ప్రారంభించినప్పుడే భారత్‌లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

వీటిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చైనా చెబుతూ వస్తోంది. తమ ఆనకట్టలేవీ నీటిని నిలిపివేసేలా ఉండవని.. విద్యుత్తు ఉత్పత్తి అవసరాలకే వాడుకుంటామని పేర్కొంది. నదిలో నీరు యథావిధిగా ప్రవహిస్తూనే ఉంటుందని చెబుతోంది.

కాగా, అత్యంత సున్నిత ప్రాంతాలుగా పేరొందిన హిమాలయ సానువుల్లో భారీ ఆనకట్టలు, జల విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణం ప్రమాదకరమని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 1.5 బిలియన్‌ డాలర్ల వ్యయంతో టిబెట్‌లోనే పెద్దదైన ఝామ్‌ విద్యుత్తు పథకం నిర్మాణం చేపట్టినప్పుడు కూడా భారత్‌ తీవ్ర అభ్యతరం వ్యక్తం చేసింది.

కానీ, యథావిధిగా చైనా దానిని పరిగణలోకి తీసుకోలేదు. తామెక్కడా నీటిని నిల్వ చేయడం లేదని, పారే నీటిని విద్యుత్తు ఉత్పత్తికి వాడుకుని తిరిగి కిందకు వదిలిపెట్టేస్తామని పేర్కొంది. కాని అడ్డుకట్ట ద్వారా నీటి పారుదల మీద నియంత్రణ ఏర్పరచుకోవడమే భారత్‌కు ఆందోళన కలిగించే విషయం.

భారత్ నిర్ణయంతోనే.. చైనా ఇలా

యూరీ ఉగ్రదాడుల అనంతరం సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని పునఃసమీక్షించడం ద్వారా పాక్‌ విషయంలో భారత్‌ పట్టు బిగిస్తుందన్న వార్తల నేపథ్యంలోనే చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

మానస సరోవరంలో పుట్టి 2,900 కిలోమీటర్ల ప్రయాణం
చైనా ఆధ్వర్యంలోని దక్షిణ టిబెట్‌ బ్రహ్మపుత్రకు జన్మస్థలం. హిమాలయాల్లోని మానస సరోవర్‌ సమీపంలో కైలాసపర్వతం దిగువన పుట్టే ఈ నది అక్కడి నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోంలలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి అక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది.

మొత్తం 2,900 కిలోమీటర్ల దూరం ప్రవహించే ఈ నదీ పరివాహకం అత్యంత సారవంతమైనది. సగటున సెకనుకు 19,300 ఘనపు మీటర్ల నీరు ప్రవహిస్తుంది. ఈ నది ఒక్కోచోట అత్యధికంగా 10 కిలోమీటర్ల వెడల్పున ప్రవహిస్తుంది. భారత్‌-చైనా మధ్య జల ఒప్పందాలేవీ లేవు. 2013 అక్టోబరులో మాత్రం సరిహద్దు నదుల విషయమై సహకారం బలపరుచుకునేలా రెండు దేశాలూ అవగాహన పత్రంపై సంతకాలు చేశాయి.

మరో మూడు ప్రాజెక్టులు యత్నం

బ్రహ్మపుత్ర, దాని ఉప నదులపై మరో మూడు ప్రాజెక్టులను కూడా నిర్మించనున్నట్లు చైనా 12వ పంచవర్ష ప్రణాళిక పేర్కొంది. ఏ నదుల మీద నిర్మిస్తుందనే విషయం వెల్లడించడంలేదు. అంతేగాక, దాగు వద్ద 640 మెగావాట్లు, ఝాంగ్ము వద్ద 510 మె.వా., ఝైచా వద్ద 320 మె.వాట్ల్ల విద్యుత్తు ప్రాజెక్టులను నిర్మించనుంది. ఈ ప్రాజెక్టుల ప్రభావం తమ దేశంపై పడుతుందని చైనాకు భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, చైనా మాత్ర భారత్ మాట వినేపరిస్థితిలో లేనట్లే కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+