షాక్: పాక్‌కు చైనా సహకారం, రాజస్థాన్ సరిహద్దు వెంట బంకర్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి పాక్ ప్రోత్సహన్ని అందిస్తోందని అమెరికా చేసిన హెచ్చరికల నేపథ్యంలో చైనా చకచకా పావులు కదుపుతోంది. పాక్- చైనా మధ్య ఆర్థిక, సైనిక సంబంధాలు రోజు రోజుకు బలపడుతున్నాయి.

మొదటి నుండి కూడ చైనా పాక్ కు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకారం అందిస్తూ వస్తోంది. అమెరికా పాక్ ను హెచ్చరించిన నేపథ్యంలో చైనా మరోసారి పాకిస్తాన్ తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకొనేదిశగా ప్రయత్నాలు చేస్తోంది.

చైనా పరోక్షంగా ఇండియాను లక్ష్యంగా చేసుకొని పాక్ కు సహకరిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇండియాతో తమకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున చైనా ప్రస్తుత పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకొంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పాక్‌తో సంబంధాలను బలోపేతం చేస్తున్న చైనా

పాక్‌తో సంబంధాలను బలోపేతం చేస్తున్న చైనా


ఇండియాకు వ్యతిరేకంగా చైనా పాక్ కు సహకారాన్ని అందిస్తోంది.పాకిస్తాన్‌-చైనా మధ్య ఆర్థిక, సైనిక సంబంధాలు రోజురోజుకూ బలోపేతమవుతున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా డ్రాగన్‌ కంట్రీ పాక్‌కు అన్ని రకాల సహకారాలు అందిస్తోంది. పాకిస్తాన్‌కు అవసరమైన సైనిక సౌకర్యాలను కల్పిస్తోంది.

అత్యాధునిక బంకర్లను నిర్మిస్తున్న చైనా

అత్యాధునిక బంకర్లను నిర్మిస్తున్న చైనా

కశ్మీర్‌ నుం‍చి గుజరాత్‌ వరకూ ఉన్న సరిహద్దు వెంబడి.. పాకిస్తాన్‌ సైనికుల కోసం చైనా అత్యాధునిక బంకర్లను నిర్మిస్తోంది.అందులో భాగంగా సైనికులకు అవసరమైన మౌలిక సౌకర్యాలను డ్రాగన్ అందిస్తోంది.కీలకమైన రాజస్తాన్‌ సరిహద్దు వద్ద ఎయిర్‌ బేస్‌ను ఆధునీకరించింది.

350 స్టోన్ బంకర్ల ఏర్పాటు

350 స్టోన్ బంకర్ల ఏర్పాటు

350 స్టోన్ బంకర్లను చైనా నిర్మించింది. బోర్డర్‌ అవుట్‌ పోస్ట్‌లను కలుపుతూ రోడ్‌నెట్ వర్క్ ను సైతం అభివృద్ధి చేస్తోంది. ఒక వేళ యుద్ధం సంభవిస్తే సైన్యానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా సరిహద్దు వెంబడి బంకర్స్‌తో పాటు కెనాల్స్‌కు చైనా ఏర్పాటు చేస్తోంది.

 ఇండియా సరిహద్దులో చైనా పావులు

ఇండియా సరిహద్దులో చైనా పావులు

భారత్‌ సరిహద్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖైరాపూర్‌ ఎయిర్‌బేస్‌లో కొన్ని నెలలుగా చైనా సైన్యం తిష్ట వేసింది. ఈ ఎయిర్‌బేస్‌ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చైనా అభివృద్ధి చేస్తోంది. పాక్‌కు అవసరమైన సహజవాయువు, ముడిచమురు, ఖనిజ వనరులను చైనానే అందిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As the presence of Chinese soldiers on Pakistani soil continues to grow, Islamabad is taking Beijing's help to rapidly ramp up its military infrastructure along its border with India along Rajasthan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X