భవనం కూలి 17మంది మృతి, 23మందికి గాయాలు
బీజింగ్: చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో నివాస భవనం కూలడంతో 17 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో 23 మంది గాయపడ్డారు. వుయాంగ్ కౌంటీలోని బైవుడు పట్టణంలో 1990లో నిర్మించిన రెండంతస్థల భవనానికి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కూలిపోయినట్లు చైనా మీడియా వెల్లడించింది.
సంఘటన స్థలంలోని నలభై మంది కార్మికులను సహాయక సిబ్బంది రక్షించారు. 17 మంది మరణించగా, 23 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది.
ఫిలిప్పీన్స్‌లో అగ్నిప్రమాదం: 15 మంది మృతి

ఫిలిప్పీన్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పబ్లిక్ మార్కెట్‌లో మంటలు వ్యాపించడంతో 15 మంది మృతిచెందారు. అందులో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. మరో 13 మంది గాయపడ్డారు. జాంబోంగా సిటీలో ఈ ఘటన జరిగింది.
విద్యుత్తు తీగలు తెగిపడడంతో వాణిజ్య కేంద్రంలో మంటలు వ్యాపించాయి. అందులో నిద్రిస్తున్న వ్యాపారులు మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి.












Click it and Unblock the Notifications