వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాపై అమెరికా పగ : జీ 20 దేశాల నుంచి బహిష్కరించేందుకు వ్యూహ్యాం..? అంత సీన్ లేదన్న చైనా..!!

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌పై బాంబులతో భీకర దాడులకు దిగిన రష్యాను.. ఆంక్షలతో అమెరికా, యూర‌ప్ దేశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి . రష్యాపై ఆర్థిక, వాణిజ్య, దౌత్యపరమైన ఆంక్షలు విధించాయి. రష్యాతో వ్యాపార కార్యకలాపాలు నిలిపివేశాయి. చ‌మురును దిగుమ‌తి చేసుకోవ‌ద్దంటూ ప్ర‌పంచ దేశాల‌కు కోరాయి. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఉక్రెయిన్ పై దాడులను తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలో రష్యాను ఒంటరి చేయాలని అమెరికా భావిస్తోంది. అందుకు కొత్త వ్యూహాల‌ను సిద్దం చేస్తోంది.

జీ 20 నుంచి రష్యాను పంపేందుకు అమెరికా వ్యూహాలు..

జీ 20 నుంచి రష్యాను పంపేందుకు అమెరికా వ్యూహాలు..

ఇందులో భాగంగానే.. రష్యాను జీ20 దేశాల నుంచి బయటకు పంపించేందుకు అమెరికా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా జీ 20లోని ఉన్న మిగతా దేశాల మద్దతును కూడగట్టేందుకు యూఎస్ అధ్య‌క్షుడు జో బైడెన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రష్యా స్థానంలో పోలండ్ దేశాన్ని జీ20లో భాగస్వామిని చేయాలని వ్యూహాలు రచిస్తున్నట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. రష్యాను తప్పించేందుకు ఇప్పటికే కొన్ని దేశాలు మద్దతిచ్చినట్లు సమాచారం.

తప్పించే హ‌క్కులేదు... రష్యాకు అండగా చైనా..

తప్పించే హ‌క్కులేదు... రష్యాకు అండగా చైనా..


జీ 20 దేశాల నుంచి రష్యాను తప్పించాలన్న యూఎస్ వ్యూహాలపై చైనా సీరియస్ అయ్యింది. రష్యాకు చైనా దౌత్యపరంగా రక్షణగా నిలిచింది. జీ 20లో రష్యాను ముఖ్యమైన సభ్యుడిగా అభివర్ణించింది. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జీ20 ప్రధాన వేదిక అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ అన్నారు. ఈ జీ 20లో రష్యా ఒక ముఖ్యమైన సభ్యుడుని స్పష్టం చేశారు. దీనిలో ఉన్న ఏ సభ్యుడినికి మరొక దేశాన్ని బహిష్కరించే హక్కు లేదని తేల్చిచెప్పింది. వాషింగ్టన్ ఉన్నత భద్రతా సలహాదారు చేసిన వ్యాఖ్యలను ఖండించింది.

జీ 20 దేశాల్లో భారత్ కూడా భాగస్వామి..

జీ 20 దేశాల్లో భారత్ కూడా భాగస్వామి..

మరోవైపు జీ20 దేశాల్లో భారత్ కూడా భాగస్వామిగా ఉంది. రష్యాను ఈగ్రూపు నుంచి తప్పించాలన్న అమెరికా తీవ్రంగా ప్రయత్నాలను చేస్తోంది. కొన్ని దేశాలు అందుకు మద్దతు కూడా పలికాయి. చైనా తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. రష్యాను తప్పించడం సాధ్యం కాదని చెప్పింది. మరి భారత్ వైఖరి ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్‌ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోందంటూ రెండు రోజుల కిందట అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాల తరహాలో భారత్.. రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయలేకపోతోందని, వణుకుతోందని అన్నారు. రష్యా వ్యతిరేక కూటమిలో భారత్‌ను మినహాయించినట్టేనని పేర్కొన్నారు . ఈ పరిణామాల నేపథ్యంలో రష్యాను జీ20 దేశాల నుంచి తప్పించే విషయంలో భారత్ ఎవరివైపు నిలవనుందో తెలియాల్సి ఉంది.

English summary
China says Members have no right to expel Russia from the G20 countries
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X