వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా, రష్యాకు ధీటుగా.. ఉపగ్రహాల ప్రయోగంలో చైనా కొత్త పుంతలు!

ఉపగ్రహాల ప్రయోగంలో చైనా వినూత్నంగా ముందుకెళ్లనుంది. ఏకంగా యుద్ధ విమానాల ద్వారా రాకెట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

షాంఘై: ఉపగ్రహాల ప్రయోగంలో చైనా వినూత్నంగా ముందుకెళ్లనుంది. సాధారణంగా ప్రత్యేక లాంచ్ ప్యాడ్ ల ద్వారా రాకెట్లను ప్రయోగించి ఉపగ్రహాలను అంతరిక్షంలోని కక్ష్యల్లో ప్రవేశపెట్టేందుకు విభిన్నంగా ప్రయోగాలు చేయనుంది.

ఏకంగా యుద్ధ విమానాల ద్వారా రాకెట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నట్లు చైనాకు చెందిన ఓ పత్రిక తెలిపింది. వందల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడంతోపాటు వాణిజ్యపరమైన, శాస్త్రపరమైన లక్ష్యాలను నెరవేర్చుకునే ఉద్దేశంతోనే ఈ దిశగా ముందుకెళుతున్నట్లుగా బీజింగ్ అధికారులు తెలిపినట్లు పేర్కొంది.

లాంచ్ వెహికల్ టెక్నాలజీని అందించే ది చైనా అకాడమీ ప్రస్తుతం 100 కేజీల పేలోడ్ లను మోసుకెళ్లగల సాంద్ర ఇంధన రాకెట్ల పరిజ్ఞానాన్ని రూపొందించినట్లు రాకెట్ డెవలప్ మెంట్ వ్యవహారాలు చూసుకునే సంస్థ డైరెక్టర్ లి టోంగ్యూ తెలిపారు.

China To Develop Space Rockets To Launch From Planes

చైనా అంతరిక్ష కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చెబుతున్నారని, ఈ కార్యక్రమానికి ఆయన అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.

అమెరికా, రష్యాలతో పోల్చినప్పుడు ఈ విషయంలో చైనా కొంత వెనకబడి ఉన్నందున వాటికి సమానంగా అంతరిక్ష రంగంలో కూడా దూసుకెళ్లేలా చేయాలని అధ్యక్షుడు ఆదేశించారని లి టోంగ్యూ చెప్పారు.

ీ నేపథ్యంలో వై-20 వ్యూహాత్మక యుద్ధ విమానాలు మోసుకెళ్లగలిగే రాకెట్ లను సిద్ధం చేస్తున్నామని, వీటి ద్వరానే రాకెట్ల ప్రయోగాలు జరిపి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నామని వెల్లడించారు.

మరోవైపు చైనా మొట్టమొదటి కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ప్రయాణం ఏప్రిల్ లో మొదలు కానుంది. 2022 నాటికి చైనా కూడా శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే.

English summary
SHANGHAI: China will develop rockets that can be launched into space from aircraft, a senior official told the state-run China Daily newspaper, as Beijing aims to send hundreds of satellites into orbit for military, commercial and scientific aims.The China Academy of Launch Vehicle Technology has designed a solid-fuel rocket that could carry a 100 kg (220 lb) payload into low Earth orbit, said Li Tongyu, the head of the agency's carrier rocket development.Chinese President Xi Jinping has prioritised advancing China's space programme, saying it was needed to enhance national security and defence, although its progress still lags behind the United States and Russia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X