వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా పుండుపై కారం చల్లుతోన్న చైనా: వాషింగ్టన్ హింసపై పేలుతోన్న సెటైర్లు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో తాజాగా నెలకొన్న హింసాత్మక పరిస్థితులు, అల్లర్లపై డ్రాగన్ కంట్రీ వింతగా స్పందించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల ఆగ్రహావేశాలతో అట్టుడికిపోతోన్న అమెరికాపై సెటైర్లను సంధిస్తోంది. పుండు మీద కారం చల్లే ప్రయత్నం చేస్తోంది. వాషింగ్టన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను హాంకాంగ్‌లో ఇదివరకు చోటు చేసుకున్న నిరసన ప్రదర్శనలతో పోల్చుతోంది చైనా మీడియా. వాషింగ్టన్ చాలా అందంగా కనిపిస్తోందంటూ ఎద్దేవా చేస్తోంది.

ఇతర రాష్ట్రాలకు పాకిన అల్లర్లు: గవర్నర్ కార్యాలయాలపై దాడికి ట్రంప్ మద్దతుదారుల ప్లాన్ఇతర రాష్ట్రాలకు పాకిన అల్లర్లు: గవర్నర్ కార్యాలయాలపై దాడికి ట్రంప్ మద్దతుదారుల ప్లాన్

ఇదివరకు హాంకాంగ్ అల్లర్లపై అమెరికా స్పీకర్ న్యాన్సీ పెలోసీ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటోంది. వాటినే తిప్పి కొడుతోంది. చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్.. వాషింగ్టన్ అల్లర్లపై ఓ ట్వీట్ చేసింది. 2019లో చైనాలో విలీనం కావడాన్ని నిరసిస్తూ హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు హాంకాంగ్‌వాసులు ఆందోళనలను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు.

China Goes Online To Mock US Capitol Chaos

అప్పట్లో చోటు చేసుకున్న సంఘటనలను తాజాగా వాషింగ్టన్ అల్లర్లతో కంపేర్ చేసింది గ్లోబల్ టైమ్స్. .చైనా అధికార పార్టీ కమ్యూనిస్టు యువజన విభాగం నాయకులు వాషింగ్టన్ అల్లర్లపై హ్యాష్‌ట్యాగ్‌ను క్రియేట్ చేశారు. చైనా దేశీయ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వీబోపై దాన్ని పోస్ట్ చేశారు. క్షణాల్లో అది హల్‌చల్ సృష్టించింది. వేలాది లైక్స్ పడ్డాయి. అదే రేంజ్‌లో షేర్ చేశారు. 230 మిలియన్ల వ్యూస్‌ లభించాయంటే.. వాషింగ్టన్ అల్లర్ల పట్ల చైనీయులు ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

ట్రంప్ హయాంలో చైనాపై విపరీతమైన ఆంక్షలు..

ఫోటోలు: వాషింగ్టన్‌లో ట్రంప్ మద్దతుదారులు నిరసనలు

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం.. చైనాపై విపరీతమైన ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలు తయారు చేసిన యాప్‌లను నిషేధించింది. చైనాకు వ్యతిరేకంగా తైవాన్‌ను ప్రోత్సహించింది. కొందరు డిప్లొమేట్ల రాకపోకలపైనా ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్‌ను చైనా ఉద్దేశూరకంగా పుట్టించిందని అమెరికా మొదటి నుంచీ అనుమానిస్తూ వస్తోంది. ఆ కారణంతో చైనాను నియంత్రించినట్లు ట్రంప్ చెప్పుకొన్నప్పటికీ.. తనకు పోటీగా ఎదుగుతోందనే ఉద్దేశం ట్రంప్‌లో కనిపించిందనే అభిప్రాయాలు లేకపోలేదు.

English summary
China's internet erupted in mirth at America's troubled democracy after supporters of President Donald Trump broke into the US Capitol, comparing the chaos to the Hong Kong anti-government protests of 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X