China: భూమిలోకి దూసుకెళ్తోన్న చైనా.. అస్సలు డ్రాగన్ దేశం ఏం చేస్తోంది..!
ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎందగాలని చైనా తహతహలాడుతోంది. అందులో భాగంగా అమెరికాకు పోటీగా ఎదుగుతోంది. అంతరిక్ష పరిశోధనలతో పాటు భూగర్భంలోనూ పరిశోధనలు చేస్తోంది. ఇందులో భాగంగా.. కొద్ది నెలల క్రితం చైనా భూగ్భంలోకి డ్రిల్లింగ్ వేసింది. సిచువాన్ ప్రావిన్స్‌లోని షెండి చువాన్కే 1 బావిని 10,520 మీటర్ల (సుమారు 6.5 మైళ్లు) లోతనై పోరు వేసింది. తాజాగా 10,000 మీటర్ల లోతు డ్రిల్లింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. చైనా గురువారం నైరుతి ప్రావిన్స్ సిచువాన్‌లో రెండవ అల్ట్రా-డీప్ డ్రిల్లింగ్ వెంచర్‌ను ప్రారంభించింది.
అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూకంపాలు, వాతావరణ మార్పుల వంటి గత సంఘటనలను గుర్తించడానికి భూమిలోకి డ్రిల్లింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా ఇంకా పూర్తి వివరణ లేదా తవ్వకం వెనుక గల కారణాలను ఇవ్వలేదు. ఈ ప్రయోగాలకు సంబంధించి చైనా ఎలాంటి సమాచారం బయటకు పొక్కనివ్వడం లేదు. అయితే భూమిలో నిక్షేపాలు ఉన్నాయా.. వాటిని ఎలా బయటకి తీయాలి.. ఎలా ఉపయోంగించుకోవాలో చైనా పరిశోధనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనాలో పెరుగుతున్న చమురు వినియోగాన్ని అందిపుచ్చుకునేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది.

సిచువాన్ పర్వత శ్రేణులకు నిలయంగా ఉంది. ఇక్కడ షేల్ గ్యాస్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అయితే భౌగోళిక పరిస్థితుల కారణంగా గ్యాస్ ను బయటకు తీసుకోలేకపోతుంది. ఎలాగైనా చమురు నిల్వలు బయటకు తీయాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైరు చమురు ఉత్పత్తిని పెంచాలని చమురు కంపెనీలపై చైనా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. భూమిపై అత్యంత లోతైన మానవ నిర్మిత రంధ్రం రష్యాలోని కోలా ద్వీపకల్పంలో ఉన్న కోలా సూపర్‌డీప్ బోర్‌హోల్, ఇది 1970, 1992 మధ్య డ్రిల్ వేశారు. ఈ రంధ్రం 12,262 మీటర్ల లోతు వరకు వెళ్లింది.
భూమి లోపలకు డ్రిల్ వేయాలంటే సవాళ్లతో కూడుకున్న విషయం. భూమి లోపలికి వెళ్లో కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుందని శాస్త్రవేతలు చెబుతున్నారు. భూమి లోపల 180 డిగ్రీల సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని చెబుతున్నారు. అప్పుడప్పుడు అగ్ని పర్వతాలు బద్దలైతే లావా బయటకు వస్తుంది. లావా భూగర్భం నుంచి బయటకు వస్తుంది.












Click it and Unblock the Notifications