చైనాలో చాపకింద నీరులా - ఒక్కరోజులో వేలల్లో..!!

బీజింగ్: రెండున్నర సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్నీ వణికించిన ప్రాణాంతక కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది చైనా. హ్యూబే ప్రావిన్స్‌లోని వుహాన్ సిటీలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి బారిన పడని దేశమంటూ లేదు. అన్ని దేశాల్లోనూ అడుగు పెట్టింది. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను తీసింది. కోవిడ్ బారిన తీవ్రంగా పడిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటోంది. 10 కోట్ల వరకు పాజిటివ్ కేసులు ఇక్కడ నమోదయ్యాయి. 11 లక్షల మంది దీని బారిన పడి మరణించారు.

రెండో స్థానంలో భారత్ నిలిచింది. నాలుగున్నర కోట్లకు పైగా పాజిటివ్ కేసులు భారత్‌లో నమోదయ్యాయి. 5,30,531 మంది మృతిచెందారు. కరోనా వైరస్‌‌ను నిర్మూలించడానికి భారత్ సహా కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తరువాత దీని తీవ్రత తగ్గింది. పూర్తిగా నిర్మూలించకపోయినప్పటికీ- అన్ని దేశాల్లోనూ ఈ మహమ్మారి విస్తరించే వేగం అదుపులోకి వచ్చింది. మాస్కులను ధరించాల్సిన అవసరం లేనంతగా దీని తీవ్రత తగ్గిపోయింది.

China has reported 16203 new Covid19 positive case for November 13

ఇప్పుడు మళ్లీ చైనాలో కరోనా వైరస్- చాప కింద నీరులా విస్తరిస్తోన్నట్టే కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 16,203 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అసింప్టోమేటిక్ కేసులు అధికంగా నమోదు కావడం చైనా అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. చైనా వ్యాప్తంగా మొత్తంగా 16,203 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 1,794 కేసులు అసింప్టోమేటిక్‌కు చెందినవే. మిగిలిన 14,409 మందిలో కోవిడ్ లక్షణాలు కనిపించాయి.

అంతకుముందు 14,878 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ రెండు సందర్భాల్లోనూ కోవిడ్ బారిన పడిన వారికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. 24 గంటల్లో కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు గానీ, అంతకుముందు 5,226 మంది దీని బారిన పడి మృతి చెందారు. ఆదివారం నాటికి చైనాలో నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,762కు చేరింది.

రాజధాని చైనాలో కొత్తగా 237 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 19 మంది మిలియన్ల ప్రజలు నివసించే గ్వాంగ్ఝౌ సిటీలో 189 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇవన్నీలోకల్‌గా విస్తరించినవే. కొత్తగా ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన వారెవరికీ ట్రావెల్ హిస్టరీ లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఝెంగ్‌ఝౌ సిటీలో 224, ఛాంగ్‌క్వింగ్‌లో 150 పాజిటివ్ కేసులు రికార్డయినట్లు నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+