Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రుడి ఆవతలి భాగంపైకి రోవర్.. ఆరుదైన ఘనత కోసం చైనా ఆరాటం! అగ్రరాజ్యాన్ని మించిపోవాలనేనా?

బీజింగ్: ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశమూ సాధించని ఘనతను సొంతం చేసుకోవడానికి చైనా సిద్ధమవుతోంది. అంతరిక్ష రంగంలో దిగ్గజ దేశాలైన అమెరికా, రష్యాలకు సాధ్యంకాని ప్రయోగాన్ని తలపెట్టింది.

కంటికి కనబడని చంద్రుడి అవతలిభాగంపై తన రోవర్‌ను దింపేందుకు చైనా ప్రయత్నం ప్రారంభించింది. 2016 డిసెంబర్‌లోనే ఈ ప్రాజెక్టు.. ఛాంగ్ 'ఎ-4 మొదలైనప్పటికీ ఈ ప్రయోగం జరిగేది మాత్రం 2018లో.. అంటే ఈ ఏడాదిలోనే.

 చంద్రుడి అవతలి భాగంలో ఏముంది?

చంద్రుడి అవతలి భాగంలో ఏముంది?

మనం భూమ్మీద నుంచి చంద్రుడిలోని ఒక భాగం మాత్రమే చూస్తుంటాం. అవతలివైపు భాగం చీకట్లోని ఉంటుంది కాబట్టి మన కళ్లకు కనబడదు. చంద్రమండలం ఆ మరోభాగం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆ భాగంపై తన వ్యోమనౌకను దింపే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది చైనా. చైనా ప్రయోగం విజయవంతమైతే చంద్రుడి వెనుక భాగం ఎలా ఉంటుందో, అసలక్కడేముందో యావత్ ప్రపంచానికి తెలుస్తుంది.

 అమెరికా, రష్యాలు కూడా...

అమెరికా, రష్యాలు కూడా...

ఇప్పటి వరకు ప్రపంచంలో కేవలం నాలుగంటే నాలుగు దేశాలు మాత్రమే చంద్రమండలంపైకి తమ ఉపగ్రహాలను పంపించగలిగాయి. వీటిలో అమెరికా ముందు వరుసలో నిలుస్తుంది. ఆ తరువాత రష్యా, మూడోస్థానంలో చైనా నిలువగా.. నాలుగో దేశం మన భారత్. అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలు సాధించిన అమెరికా, రష్యాలు కూడా చంద్రుడిలో కంటికి కనిపించే భాగంపైకి మాత్రమే తమ స్పేస్‌క్రాఫ్ట్‌లను పంపించాయి.

 గత ప్రయోగాల అధ్యయనంతో...

గత ప్రయోగాల అధ్యయనంతో...

చంద్రుడి చుట్టూ పరిభ్రమించే లక్ష్యంతో 2007లో చైనా ఛాంగ్'ఎ-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 2010లో ఛాంగ్'ఎ-2 ను చైనా ప్రయోగించింది. ఈ రెండు ప్రయోగాల ద్వారా చంద్రుడి ఉపరితలాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన చైనా 2013 డిసెంబరులో ఛాంగ్'ఎ-3 ఉపగ్రహాన్ని చంద్రుడిపైన ఇంద్రధనుస్సుల అఖాతంగా పిలిచే చోట సాఫ్ట్ ల్యాండింగ్ పద్ధతిలో దింపింది. చైనా పంపిన ఈ ఉపగ్రహంలో టెలిస్కోప్, కెమెరాలతోపాటు ఒక రోవర్ కూడా ఉంది. చంద్రమండలానికి సంబంధించి చైనా అంతరిక్ష పరిశోధనల్లో ఈ ప్రయోగం ఒక మైలురాయిగా చెప్పొచ్చు. ఎందుకంటే, 1976 తరువాత చంద్రుడిపై ల్యాండైన తొలి రోవర్ చైనాదే మరి.

 సాఫ్ట్ ల్యాండింగ్ ఫీట్.. ఒక సవాలే!

సాఫ్ట్ ల్యాండింగ్ ఫీట్.. ఒక సవాలే!

చంద్రుడిపై గతంలోనే అమెరికా, సోవియట్ రష్యాలు ప్రయోగించిన ఉపగ్రహాలు దిగినప్పటికీ ఈ ‘సాఫ్ట్ ల్యాండింగ్' ఫీట్ అనేది మాత్రం అంతరిక్ష శాస్త్రజ్ఞులకు ఇప్పటికీ ఒక సవాలే. ఎందుకంటే, చంద్రుడిపై వాతావరణం అనేది ఉండకపోవడం వల్ల గురుత్వాకర్షణ శక్తి అత్యంత తక్కువగా ఉంటుంది. ఇలాంటి స్థితిలో పారాచ్యూట్‌ల సహాయంతో చంద్రుడిపై దిగడం సాధ్యం కాదు. రాకెట్ మోటార్ల ద్వారానే ఉపరితలంపై దిగవలసి ఉంటుంది. సరైన కోణంలో, సరైన వేగంతో దిగితేనే ల్యాండింగ్ సులభం అవుతుంది. లేకపోతే ఉపగ్రహం దెబ్బతినడమో, ప్రయోగం విఫలమవడమో జరుగుతుంది. అయితే చైనా తన మూడో ప్రయోగంతోనే దీన్ని సాధించింది. అత్యంత జాగ్రత్తగా తన ఛాంగ్‘ఎ-3 ఉపగ్రహాన్ని చంద్రుడి ఊపరితలంపై దింపి అంతరిక్ష రంగంలో తన శక్తిని లోకానికి చాటి చెప్పింది.

 ఛాంగ్ ఎ-4 ప్రాజెక్టులో ఏం చేస్తారంటే...

ఛాంగ్ ఎ-4 ప్రాజెక్టులో ఏం చేస్తారంటే...

చాంగ్ ఎ-4 ప్రాజెక్టులో భాగంగా మొదట చైనా అంతరిక్ష సంస్థ ఓ రిలే శాటిలైట్‌ను చంద్రుడి వెనక భాగానికి పంపుతుంది. ఇది చంద్రుడి వెనుక భాగాన 60 వేల కిలోమీటర్ల దూరంలో ఉండి, కంటికి కనబడని ఆ భాగానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భూమికి చేరవేస్తూ ఉంటుంది. ఇది విజయవంతమైతే.. ఇక అసలు ఘట్టానికి తెర లేస్తుంది. శాటిలైట్ అందించే సమాచారంతో చంద్రుడి వెనుక భాగంవైపు చైనా తన రోవర్‌ను దింపుతుంది. ఇదేగనుక జరిగితే.. ఒక్క చైనాకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన అంతరిక్ష పరిశోధనల్లోనే ఇది ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. ఎందుకంటే, చంద్రుడిపైకి తొలిసారిగా మనుషులను పంపి చరిత్ర స‌‌ృష్టించిన అమెరికాకు కూడా సాధ్యం కాని రికార్డు ఇది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+