చైనా-పాక్ కారిడార్: ఇండియా-పాక్‌ల మధ్య యుద్ధం?: మైఖేల్ కూగల్‌మెన్ సంచలనం
చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కారణంగా ఇండియా-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని విల్సన్ సెంటర్ దక్షిణాసియా డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కూగల్‌మెన్
వాషింగ్టన్: చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కారణంగా ఇండియా-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని విల్సన్ సెంటర్ దక్షిణాసియా డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కూగల్‌మెన్ అభిప్రాయపడ్డారు.
చైనా-పాకిస్తాన్‌లు ఎకనామిక్ కారిడార్‌ను ప్రారంభించాయి. అయితే ఈ కారిడార్ రూట్ మార్చాలని ఇండియా కోరింది. అయితే ఈ రూట్‌ను మార్చేందుకు చైనా అంగీకరించలేదు. ఈ విషయమై ఇటీవల చైనాలో జరిగిన ఓ సమావేశాన్ని ఇండియా బహిష్కరించి బయటకు వచ్చింది.
పీఓకే గుండా ఈ రూట్ వెళ్తోంది. అయితే దీన్ని మార్చాలని ఇండియా పట్టుబట్టింది. కానీ, ఈ విషయమై ససేమిరా అంటోంది చైనా. అయితే ఈ కారిడార్‌లో చేరాలని ఇండియాను చైనా కోరింది. కానీ ఇండియా మాత్రం దీనికి అంగీకరించలేదు.

చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌తో ఉద్రిక్తతలు
బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వల్ల ఉపఖండంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశముందని అమెరికాకు చెందిన మేధావులు అంచనా వేస్తున్నారు. సీపీఈసీ ప్రాజెక్ట్ వల్ల భారత్-పాకిస్తాన్ మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు విల్సన్ సెంటర్ దక్షిణాసియా డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కూగల్‌మెన్ అభిప్రాయపడ్డారు.

చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చైనా కల
సీపీఈసీ ప్రాజెక్ట్ నిర్మించడం చైనా బలీయమైన కోరిక. ఈ ప్రాజెక్టు పూర్తైతే కొన్ని దేశాలకు చైనాకు మధ్య దూరం చాలా తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ ఎకనామిక్ కారిడార్ నిర్మాణానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఉగ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం గుండా ఈ రూట్ వెళ్తోంది.దీంతో బ్యాంకులు పెట్టుబడులు పెట్టేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. మరో వైపు ఈ ప్రాజెక్టు కారణంగానే పాక్-ఇండియా మధ్య యుద్ద వాతావరణం నెలకొనే అవకాశాలు లేకపోలేదని నిఫుణులు హెచ్చరిస్తున్నారు.

ఆర్థిక వ్యయాన్ని పాక్ భరిస్తోందా?
చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణ వ్యయాన్ని పాకిస్తాన్ ఇప్పుడున్నపరిస్థితుల్లో భరించగలదా అన్న అనుమానాన్ని విల్సన్ సెంటర్ దక్షిణాసియా డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కూగల్‌మెన్ వ్యక్తం చేశారు.ప్రధానంగా విద్యుత్ సంస్థల ఏర్పాటుకు పాకిస్తాన్ ఆర్థిక సహకారం అందించే విషయంపై ఆయన అనుమానాలు లేవనెత్తారు.

పాక్ అవసరాలకే విద్యుత్ సరిపోదు
సీపీఈసీ ప్రాజెక్ట్ వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్ పాకిస్తాన్ అవసరాలకు ఏమాత్రం సరిపోదని మైఖేల్ కూగల్‌మెన్ చెప్పారు. చైనా ఆసక్తి, కోరికల మేరకు పనిచేయడం అనేది.. పాకిస్తాన్ రక్షణ, ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసుకోవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టును ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టు ముందుకు సాగితే ఆసియాలో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications