Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తాలిబన్లను ముంచుతున్న చైనా, పాకిస్తాన్ ? ఇప్పట్లో గుర్తింపు కష్టమే-భారత్ కు మాత్రం ముప్పు

ఆప్ఘనిస్తాన్ లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని పూర్తిస్ధాయిలో సద్వినియోగం చేసుకునేందుకు ఎప్పటినుంచో కాసుకుని కూర్చున్న పాకిస్తాన్, చైనా వెంటనే రంగంలోకి దిగిపోయాయి. ముందుగా ఆప్ఘనిస్తాన్ కు అమెరికాను దూరం చేసిన వీరిద్దరూ ఇప్పుడు తాలిబన్లకు అంతర్జాతీయ గుర్తింపు ఇప్పించేందుకు తెగ ప్రయత్నిస్తున్నాయి. అయితే తమ సొంత దేశాల్లో సమస్యలే వీరికి అడ్డంకిగా మారబోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తాలిబన్లకు వీరి మద్దతు కారణంగా భారత్ కూ ముప్పు పెరుగుతోంది.

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల సర్కార్

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల సర్కార్


ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో అధికార పగ్గాలు చేపట్టిన తాలిబన్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం పూర్తయింది. ఇప్పటికే ప్రభుత్వం రోజువారీ పాలన నిర్వహిస్తోంది కూడా. అయితే ఈ ప్రభుత్వ ఏర్పాటుతో పాటు రోజువారీ పాలనలోనూ వారికి ఆప్ఘనిస్తాన్ లో ఉన్న వారి మద్దతు కంటే విదేశీ మద్దతు ముఖ్యంగా మారిపోయింది. దీంతో పొరుగున ఉన్న పాకిస్తాన్, చైనా మద్దతుతో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడుపుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో ఎవరుండాలనే దాన్ని కూడా నిర్ణయించింది పాకిస్తానే. దీంతో ఇప్పుడు పాకిస్తాన్, చైనాల మద్దతుతో సాగుతున్న ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయమూ కీలకంగా మారిపోతోంది.

అంతర్జాతీయ గుర్తింపుకు తహతహ

అంతర్జాతీయ గుర్తింపుకు తహతహ

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో అధికారంలోకి వచ్చిన తాలిబన్లు.. తమ ప్రభుత్వానికి వీలైనన్ని ఎక్కువ దేశాల నుంచి మద్దతు కావాలని కోరుకుంటున్నారు. అప్ఘనిస్తాన్ పునర్నిర్మాణంతో పాటు పలు కీలక అంశాల్లో అంతర్జాతీయ మద్దతు లేనిదే ముందడుగు పడే పరిస్ధితి లేదు. దీంతో తాలిబన్ల సర్కార్ కు అంతర్జాతీయ గుర్తింపు ముఖ్యంగా మారిపోయింది. ఇందుకోసం తిరిగి తమ మిత్ర దేశాలైన పాకిస్తాన్, చైనాల మద్దతు కోరుతున్నారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఇరుదేశాలూ ఆప్ఘనిస్తాన్ లోని తాలిబన్ల ప్రభుత్వానికి అంతర్జాతీయ మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

 తాలిబన్లతో చైనా పరస్పర స్నేహం వెనుక ?

తాలిబన్లతో చైనా పరస్పర స్నేహం వెనుక ?

తాలిబన్లతో ఎప్పటి నుంచో స్నేహం చేస్తున్న చైనా ఇప్పుడు వారికి అంతర్జాతీయ గుర్తింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచం దృష్టిలో తాలిబన్లకు ఉన్న ముద్రను సాధ్యమైనంత త్వరగా చెరిపేసి వారికి గుర్తింపు ఇప్పించేందుకు చైనా వీరోచితంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇంత హడావిడిగా తాలిబన్లకు అంతర్జాతీయ మద్దతు ఇప్పించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాల వెనుక ఇరుదేశాల లేదా వర్గాల ప్రయోజనాలు ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆప్ఘన్ సరిహద్దు వెంబడి తమ భూభాగంలో ఉంటూ చికాకు పెడుతున్న ఉఘ్ ఘర్ ముస్లిం గ్రూపుల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా చైనా పావులు కదుపుతోంది. ప్రపంచం దృష్టిలో వీరికి ఉగ్రవాదులుగా ముద్ర వేస్తూ చైనా నియంత్రిస్తోంది. అదే సమయంలో వారు ఆప్ఘన్ లోనూ ప్రవేశించి తమను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి తాలిబన్ల మద్దతు కావాలని కోరుకుంటోంది. ఇదే క్రమంలో చైనా నుచి భారీ ఎత్తున పెట్టుబడులు ఆశిస్తున్న తాలిబన్లు... ఆప్ఘన్ పునర్నిర్మాణం పేరుతో చైనాకు దగ్గరవుతున్నారు.

పాకిస్తాన్ తో తాలిబన్ల స్నేహం వెనుక ?

పాకిస్తాన్ తో తాలిబన్ల స్నేహం వెనుక ?

అలాగే పాకిస్తాన్ తో తాలిబన్ల స్నేహం వెనుక కూడా కీలక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్, ఆప్ఘన్ సరిహద్దుల్లో ఉన్న తీవ్ర వాద గ్రూపులతో అటు పాకిస్తాన్ ఆర్మీతో పాటు అక్కడి రాజకీయ నేతలకు సత్సంబంధాలు ఉన్నాయి. వీరితో వివాదాలు కొని తెచ్చుకునే పరిస్ధితి తాలిబన్లకు లేదు. అదే జరిగితే తాలిబన్లకు వారి మద్దతుతో పాటు పాకిస్తాన్ సర్కార్ కూడా కరవవుతుంది. అందుకే పాకిస్తాన్ తో స్నేహం కోసం తాలిబన్లు అర్రులు చాస్తుంటారు. అదే సమయంలో వారి నుంచి సాయం తీసుకుని తాజాగా పంజ్ షీర్ ను స్వాధీనం చేసుకున్న చరిత్ర కూడా తాలిబన్లకు ఉంది. ఇదే క్రమంలో తాలిబన్లను మంచి చేసుకోవడం ద్వారా ఆప్ఘనిస్తాన్ లో పాలనను, అక్కడి భూభాగాన్ని పరోక్షంగా తమ ఆధీనంలో ఉంచుకోవడం పాకిస్తాన్ కు వ్యూహాత్మకంగా చాలా ఆవసరం. భారత్ ను అడ్డుకునే క్రమంలో ఇది పాకిస్తాన్ కు తప్పనిసరిగా మారిపోతోంది.

తాలిబన్లకు అడ్డంకి చైనా, పాకిస్తాన్ లే ?

తాలిబన్లకు అడ్డంకి చైనా, పాకిస్తాన్ లే ?

ఉగ్రవాద గ్రూపులతో వ్యవహారాల విషయంలో తాలిబన్లకు మద్దతిస్తున్న పాకిస్తాన్, చైనాకు .. ఇప్పుడు వారు కోరుకుంటున్న అంతర్జాతీయ గుర్తింపు విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు. ఎందుకంటే పాకిస్తాన్ తీవ్రవాదానికి మద్దతిస్తున్న ఘటనలు ఎన్నో చరిత్రలో ఉన్నాయి. వీటిని భారత్ పలుమార్లు ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లింది. అదే సమయంలో చైనాలోని ఉయ్ ఘర్ ముస్లిం గ్రూపుల అణచివేత విషయంలో తాలిబన్లతో అవగాహనతో ముందుకు సాగుతున్న చైనా కూడా అంతిమంగా తాలిబన్లకు మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే తీవ్రవాద సంస్ధలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న తాలిబన్లకు గుర్తింపు కోసం వేర్వేరు కారణాలతో చైనా, పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయంగా ఇప్పుడు మద్దతు లభించడం లేదు. దీంతో తాలిబన్లకు వీరిద్దరూ పరోక్షంగా కీడు చేస్తున్నట్లే ఉంది.

Recommended Video

    Cricket Australia Warns Talibans.. మ‌హిళ‌ల‌ను ఆడనిస్తేనే మీతో సిరీస్ || Oneindia Telugu
     చైనా, పాకిస్తాన్ చర్యలతో భారత్ కు ముప్పు ?

    చైనా, పాకిస్తాన్ చర్యలతో భారత్ కు ముప్పు ?

    ప్రస్తుతం చైనా, పాకిస్తాన్ వేర్వేరు కారణాలతో తాలిబన్ల సర్కారుకు మద్దతు ఇస్తున్నాయి. అలాగే తాలిబన్లు కూడా తీవ్రవాద గ్రూపులకు సాయం చేస్తూ వారి మద్దతు కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వీరంతా కలిసి అంతిమంగా భారత్ కు శత్రువుల్లా తయారవుతున్నారు. ఇప్పటికే భారత్ అంటేనే మండిపడుతున్న చైనా, పాకిస్తాన్.. పరోక్షంగా, ప్రత్యక్షంగా తాలిబన్లకు సాయం చేయడం ద్వారా భారత్ కు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అదే సమయంలో భారత్ లోని కశ్మీర్ వంటి వివాదాస్పద అంశాల విషయంలో తాలిబన్లను ఎగదోస్తున్నాయి. దీంతో మన భూభాగంలో తాలిబన్ల ముప్పు పెరుగుతోంది. అందుకే కేంద్రం కశ్మీర్ విషయంలో తాలిబన్ల ముప్పుపై ఆందోళన చెందుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+