బ్రహ్మపుత్రపై కాదు, ఇతర నదులపై: డ్యాంలపై చైనా ట్విస్ట్, అందుకే రెచ్చిపోతోందా?
చైనా బ్రహ్మపుత్ర నదిపై డ్యాం నిర్మించేందుకు సన్నాహాలు చేయడం లేదని, టిబెట్ ప్రాంతంలో హైడ్రోపవర్ ప్రాజెక్టులు, తమ ఆదీనంలో ఉన్న నదుల పైన డ్యాంలు నిర్మించేందుకు సిద్ధమవుతోందని చైనా స్టేట్ మీడియా తెలిపింది
Recommended Video

బీజింగ్: చైనా బ్రహ్మపుత్ర నదిపై డ్యాం నిర్మించేందుకు సన్నాహాలు చేయడం లేదని, కానీ టిబెట్ ప్రాంతంలో హైడ్రోపవర్ ప్రాజెక్టులు, తమ ఆదీనంలో ఉన్న నదుల పైన డ్యాంలు నిర్మించేందుకు సిద్ధమవుతోందని చైనా స్టేట్ మీడియా తెలిపింది.
బ్రహ్మపుత్ర నదిని తరలించేందుకు చైనా 1000 కిలో మీటర్ల మేర ఓ సొరంగం తవ్వుతోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది అసత్య ప్రచారం అని చైనా కొట్టి పారేసింది. తాము అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని తేల్చి చెప్పింది.

బ్రహ్మపుత్రపై భారీ ప్రాజెక్టులపై చైనా ఖండన
బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు వస్తున్న కథనాలను చైనా అధికారవర్గాలు ఖండించాయి. టిబెట్‌లో పుట్టే నదిని అక్కడ యార్లంగ్‌సాంగ్పోగా వ్యవహరిస్తారు. అనంతరం పెద్ద మలుపు తీసుకొని భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లోకి వస్తుంది. అనంతరం అసోంలో ఈ నదిని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు.

సొరంగం కథనాలపై చైనా ఇలా
టిబెట్ నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర సొరంగం నిర్మించి చైనాలోని ఉత్తరాది ప్రాంతాలకు నీటి సౌకర్యం కల్పించాలన్న చైనా యోచనను గతనెలలో అనేక పత్రికలు తమ కథనాల్లో ప్రచురించాయి. అయితే ఈ కథనాలను చైనా వర్గాలు కొట్టిపారేశాయి.

ఈ నదుల పైనే ప్రాజెక్టులు
టిబెట్‌లోని హిమనీ నదాల్లో పలు నదులు జన్మిస్తాయి. వీటిలో జిన్షా, లంకాంగ్, న్యుజింగ్ తదితర నదులపై మాత్రమే కొత్త నిర్మాణాలు చేపట్టనున్నట్టు చైనా తెలిపింది. వీటితో బ్రహ్మపుత్రకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

గణాంకాలతో సహా భారత్ నిరూపించింది
జిన్షా నదిపై సువ్లాంగ్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 2021 కల్లా ఇది పూర్తవుతుంది. అయితే బ్రహ్మపుత్రపై 2014లోనే జంగ్ము ప్రాజెక్టును నిర్మించినప్పుడు భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులను నిర్మిస్తే బ్రహ్మపుత్రలో నీటి ప్రవాహం తగ్గుతుందని గణాంకాలతో సహా చైనాకు చూపించి నిరసన తెలిపింది.

కోట్ల మంది ఆధారపడి జీవిస్తున్నారు
టిబెట్‌లో జన్మించే బ్రహ్మపుత్ర నది భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, అసోంలో ప్రవహించి అనంతరం బంగ్లాదేశ్‌కు చేరుతుంది. ఈ నదీ జలాలలపై కొన్ని కోట్లమంది ఆధారపడి జీవిస్తున్నారు.

నదీజలాల ఒప్పందాలు లేవనే చైనా ఇలా
నీటితో ఎల్లప్పుడూ నిండుగా ఉండే బ్రహ్మపుత్ర నీటిని తమ దేశంలో ఉత్తర రాష్ట్రాలకు తరలించాలన్నది చైనా ఆలోచన. అయితే భారత్‌కు చైనాతో ఎలాంటి నదీజలాల ఒప్పందాలు లేవని, ఫలితంగా చైనా నీటిని తరలించేందుకు వ్యూహాలు పన్నుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications