పాక్‌పై చర్యకు పట్టు: భారత్‌ను అడ్డుకున్న చైనా
న్యూయార్క్: 36/11 దాడుల ప్రధాన సూత్రధారి అయిన ఉగ్రవాది లఖ్వీ విడుదలలో పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాలన్న భారత డిమాండుకు ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుపడింది. దీంతో ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చైనా నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఐరాస తీర్మానాన్ని ఉల్లంఘిస్తూ.. పాకిస్థాన్, ముంబై దాడుల సూత్రధారి జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీని విడుదల చేసిందనీ, ఆ దేశంపై చర్య తీసుకోవాలని భారత్ ఐరాసను డిమాండు చేసింది.
భారత్ వినతిపై సమావేశమైన ఐరాస ఆంక్షల కమిటీ.. లఖ్వీ విడుదలపై పాకిస్థాన్ నుంచి వివరణ కోరాల్సి ఉండగా.. చైనా ప్రతినిధి ఈ చర్యను అడ్డుకున్నారు. భారత్ తగినంత సమాచారాన్ని అందజేయలేదంటూ అభ్యంతరం తెలిపినట్లు అధికారవర్గాల సమాచారం.

ఈ పరిణామాలపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పందిస్తూ.. ఈ అంశాన్ని ఐరాస ఆంక్షల కమిటీ సభ్యదేశాల దృష్టికి ద్వైపాక్షికంగా తీసుకెళ్లామన్నారు.
2008, డిసెంబర్‌లో లఖ్వీని అరెస్ట్ చేసిన పాకిస్థాన్.. సరైన ఆధారాలు లేవని అతడ్ని ఇటీవల విడుదల చేసింది. ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తొయిబా సంస్థకు కమాండర్‌గా వ్యవహరిస్తున్న లఖ్వీ విడుదలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసినా.. పాక్ పట్టించుకోలేదు.












Click it and Unblock the Notifications