భారత్‌కు చైనా షాక్.. స్నేహం ముసుగులో మరోసారి మోసం!

India-China: ఓ వైపు చైనా భారత్‌తో స్నేహపూర్వక మాటలు చెబుతూనే.. మరోవైపు తన ఇంజనీర్లను భారత నుంచి వెనక్కి పిలిపించుకుంటోంది. ఐఫోన్ సరఫరాదారు అయిన ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ అయిన యుజాన్ టెక్నాలజీ తన భారతీయ ప్లాంట్ నుంచి దాదాపు 300 మంది చైనా ఇంజనీర్లను వెనక్కి పంపింది. గత కొన్ని నెలల్లో ఇది రెండో సారి. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

ఐఫోన్ తయారీలో ఆపిల్‌కు ప్రధాన భాగస్వామి అయిన ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ యుజాన్ టెక్నాలజీ తన భారతీయ ప్లాంట్ నుంచి 300 మంది చైనా ఇంజనీర్లను తిరిగి వెనక్కి పంపించింది. ఇది కేవలం ఒక సంఘటన కాదు, కొన్ని నెలల్లో రెండోసారి ఇలా జరగడం గమనార్హం. ఈ ఘటన భారత-చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయని భావిస్తున్న సమయంలో జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించుకోవడం, వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడం వంటి చర్యలు తీసుకుంటున్నామని ఇరు దేశాలు చెబుతున్నాయి. కానీ ఈ చర్య చైనా నిజమైన ఉద్దేశాలపై అనుమానాలను పెంచుతోంది.

China s Hidden Strategy 300 Engineers Pulled Out of India Amid Diplomatic Smiles

ఫాక్స్‌కాన్ పెట్టుబడులు.. చైనా వైఖరి
ఫాక్స్‌కాన్ సంస్థ అమెరికా టారిఫ్‌ల ఒత్తిడి కారణంగా తన ఐఫోన్ తయారీ యూనిట్లను చైనా నుంచి భారత్‌కు మార్చాలని చూస్తోంది. ఇందులో భాగంగా, యుజాన్ టెక్నాలజీ ద్వారా తమిళనాడులో రూ.13,180 కోట్ల భారీ పెట్టుబడితో ఒక డిస్‌ప్లే మాడ్యూల్ అసెంబ్లీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. అయితే, చైనా ప్రభుత్వం ఈ ఇంజనీర్లను వెనక్కి పిలిపించుకోవాలని ఫాక్స్‌కాన్‌ను ఆదేశించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియు‌ను భారత్‌లో తమ పెట్టుబడులపై ఒక నివేదిక సమర్పించాలని కూడా చైనా ప్రభుత్వం కోరింది. ఇది భారత్‌లో చైనా సంస్థల పెట్టుబడులపై నియంత్రణ పెంచే ప్రయత్నంగా కనిపిస్తోంది.

భారత ప్రత్యామ్నాయ ప్రణాళికలు
ఈ ఘటన ఎక్కువగా ప్రభావం చూపకపోవచ్చునని నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణం ఫాక్స్‌కాన్ వంటి సంస్థలు ఇలాంటి పరిస్థితులను ఊహించి ఇప్పటికే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. చైనా ఇంజనీర్లకు బదులుగా తైవాన్, జపాన్, ఇతర దేశాల నుంచి సాంకేతిక నిపుణులను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

భారత్-చైనా సంబంధాలు
ఈ ఘటనలు జరుగుతున్నప్పటకీ.. గత కొన్ని నెలలుగా భారత్-చైనా మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడుతున్నయి. సరిహద్దు సమస్యలు, వాణిజ్య సహకారంపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. అలాగే, ప్రత్యక్ష విమాన సర్వీసులు, వాణిజ్య సంబంధాలు పునఃప్రారంభమయ్యాయి. అయితే ఈ సాన్నిహిత్యం తాత్కాలికమేనా, లేక దీర్ఘకాలికంగా ఉంటుందా అనే సందేహాలకు ఈ ఇంజనీర్ల వెనక్కి పిలుపు ఘటన మరింత బలం చేకూరుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+