చైనా కొత్తతరం క్షిపణి! ధ్వనికన్నా 10 రెట్ల వేగంతో.. ప్రపంచంలో ఎక్కడికైనా..

బహుళ అణు వార్‌హెడ్లను మోసుకెళ్లే అధునాతన ఖండాంతర క్షిపణిని చైనా రూపొందించింది. ఇది ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చేరగలదని ఆ దేశ అధికారిక మీడియా ‘గ్లోబల్‌ టైమ్స్‌’ పేర్కొంది.

బీజింగ్‌: బహుళ అణు వార్‌హెడ్లను మోసుకెళ్లే అధునాతన ఖండాంతర క్షిపణిని చైనా రూపొందించింది. ఇది ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చేరగలదని ఆ దేశ అధికారిక మీడియా 'గ్లోబల్‌ టైమ్స్‌' పేర్కొంది.

డాంగ్‌ఫెంగ్‌-41 అనే ఈ క్షిపణి.. ధ్వని కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లగలదు. శత్రుదేశపు క్షిపణి హెచ్చరిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థలను ఏమార్చి దాడులు చేయగలదు. వచ్చే ఏడాది చైనా సైన్యం అమ్ములపొదిలో ఈ క్షిపణి చేరనుంది.

China's Next-Gen ICBM Dongfeng-41 will reach any place in the World!

ఈ అధునాతన ఖండాంతర క్షిపణిలో మూడు అంచెలు ఉన్నాయి. అవన్నీ ఘన ఇంధనంతో పని చేస్తాయి. ఈ క్షిపణి కనీసం 12 వేల కిలోమీటర్ల దూరం పయనించగలదు. అంటే.. ప్రపంచంలో ఏ ప్రాంతంమీదైనా ఇది విరుచుకుపడగలదు.

డాంగ్‌ఫెంగ్‌-41 క్షిపణి తనతోపాటు 10 అణు వార్‌హెడ్లను మోసుకెళ్లగలదు. ప్రయోగానంతరం.. అవన్నీ క్షిపణి నుంచి విడిపోయి.. నిర్దేశించిన రీతిలో వేరు వేరు లక్ష్యాలను ఛేదిస్తాయి. అమెరికాను దృష్టిలో పెట్టుకొనే చైనా దీన్ని రూపొందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+