వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు ఊహించిన ఎదురుదెబ్బ: కూల‌నున్న స్పేస్ స్టేష‌న్‌

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఐదు సంవత్సరాల కిందట చైనా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తొలి స్పేస్ స్టేషన్ తియాంగాంగ్-1 వచ్చే ఏడాది నేల కూలనుంది. ఈ విషయాన్ని చైనా అధికారికంగా స్పష్టం చేసింది. చైనాకు చెందిన స్పేస్ ప్రోగ్రామ్ సీనియర్ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు.

8.5 టన్నులు బరువున్న ఈ మాడ్యూల్‌పై చైనా నియంత్రణం కోల్పోయిందని 2017లో అది నేలకూలనుందని పేర్కొన్నారు. అయితే ఈ మాడ్యూల్ నేల కూలే సమయంలో అందులోని చాలా భాగాలు మ‌ధ్య‌లోనే బూడిదైపోతాయ‌ని చైనా అంత‌రిక్ష అధికారులు వెల్ల‌డించారు.

2011, సెప్టెంబ‌ర్ 29న చైనా తియాంగాంగ్‌-1ను అంత‌రిక్షంలోకి పంపించారు. చైనా ఈ తొలి స్పేస్ స్టేష‌న్‌ను లాంచ్ చేయ‌డంతో అంత‌రిక్ష రంగంలో సూప‌ర్ ప‌వ‌ర్‌గా నిలిచింద‌ని యావత్ ప్రపంచం భావించింది. కానీ ఐదేళ్ల‌లోనే వారు ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది.

China's space station is 'out of control' and will crash into Earth

అయితే త‌మ స్పేస్ స్టేష‌న్ త‌న ప‌నిని పూర్తి చేసింద‌ని, 2017 రెండో అర్ధ‌భాగంలో భూవాతావ‌ర‌ణంలోకి తిరిగి ప్ర‌వేశించ‌బోతోంద‌ని చైనా శాస్త్ర‌వేత్త‌లు గత వారంలో వెల్లడించడం గమనార్హం. కాగా, సాంకేతిక లోపం కార‌ణంగా స్పేస్ స్టేష‌న్‌పై చైనా త‌న నియంత్ర‌ణ కోల్పోయింద‌ని గత కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగతి తెలిసిందే.

స‌హ‌జంగానే మాడ్యూల్ భూవాతావ‌ర‌ణంలోకి అడుగుపెడుతుంద‌ని చెప్ప‌డాన్ని బ‌ట్టి చైనా దానిపై నియంత్ర‌ణ కోల్పోయింద‌న్న‌ది స్ప‌ష్ట‌మైంద‌ని హార్వ‌ర్డ్ శాస్త్ర‌వేత్త జోనాథ‌న్ మెక్‌డోవెల్ అన్నారు. ఇదే నిజ‌మైతే స్పేస్ స్టేష‌న్ తాలూకు శ‌క‌లాలు భూమిపై ఎప్పుడు, ఎక్క‌డ ప‌డ‌తాయో ఊహించ‌డం సాధ్యం కాద‌ని ఆయ‌న తెలిపారు.

అది భూవాతావ‌ర‌ణంలోకి ప్ర‌వేశించ‌బోయే ఆరు, ఏడు గంట‌ల ముందు మాత్ర‌మే ప‌సిగ‌ట్ట‌గ‌ల‌మ‌ని, దీంతో అది ఎక్క‌డ ప‌డుతుందో చెప్ప‌డం కూడా క‌ష్ట‌మ‌వుతుంద‌ని మెక్‌డోవెల్ అన్నారు. వాతావ‌ర‌ణంలో స్వ‌ల్ప మార్పులు జ‌రిగినా వాటి శ‌క‌లాలు ప‌డే అవ‌కాశం ఒక ఖండం నుంచి మ‌రో ఖండానికి మారుతుంద‌ని ఆయన తెలిపారు.

English summary
China has confirmed rumours that its Tiangong-1 space station is out of control and will crash back to Earth in 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X