జియాబోకు నోబెల్‌ప్రైజ్ ఇవ్వడం దైవదూషణతో సమానం: చైనా
చైనా మరోసారి తన దుష్ప్రవర్తనను బయటపెట్టుకొంది. అంతర్జాతీయ సంస్థ తమదేశ పౌరుడికి ఇచ్చిన సత్కారాన్ని తప్పుబట్టింది.
హైదరాబాద్: చైనా మరోసారి తన దుష్ప్రవర్తనను బయటపెట్టుకొంది. అంతర్జాతీయ సంస్థ తమదేశ పౌరుడికి ఇచ్చిన సత్కారాన్ని తప్పుబట్టింది.
ఆ వ్యక్తికి అవార్డు ఇవ్వడం అంటే దైవదూషణ చేసినట్టేనంటూ తనకి ఇష్టం వచ్చినంటూ ప్రకటన చేసింది. చైనాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం పోరాడి జైలు శిక్షకు గురైన ప్రముఖ పోరాటయోధుడు లియు జియాబో గురువారంనాడు కన్నుమూశాడు.

ఆయనకు జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. అయితే క్యాన్సర్ బారినపడిన ఆయనకు మెరుగైన వైద్యం ఇచ్చేందుకు చైనా నిరాకరించడంతోపాటు విదేశాలకు వెళ్ళి వైద్యం ఇచ్చేందుకు చైనా నిరాకరించింది.
దీంతో అంతర్జాతీయ సమాజం నుండి చైనా తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అప్పుడప్పుడు అమెరికా, జర్మనీ నుండి వైద్యులకు ప్రత్యేక అనుమతిని ఇప్పించి వైద్యం చేయించారు. అయినా ఆయన కన్నుమూశారు.
దీంతో చైనా తీరు వల్లే నోబెల్ పురస్కార గ్రహీత కన్నుమూశాడంటూ తీవ్ర విమర్శలు చెలరేగాయి. తన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు అసలు ఆయనకు నోబెల్ అవార్డును ఇవ్వడమంటేనే దైవ దూషణ చేసినంత పని అంటూ చైనా వ్యాఖ్యలు చేసింది.












Click it and Unblock the Notifications