• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గల్వాన్ లోయ: సైనికులకు మార్ష‌ల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్న చైనా.. భారత సరిహద్దులో గన్స్ వాడకంపై నిషేధం వల్లేనా?

By BBC News తెలుగు
|
జింగ్హౌ, గాంగ్షీ ప్రాంతంలోని సముద్రంలో ఆర్మ్‌డ్ పోలీసు అధికారులకు దుంగల్ని ఎత్తే శిక్షణ ఇస్తున్న చైనా (2020 జూన్ 16వ తేదీన తీసిన చిత్రం)
  #IndiaChinaFaceOff : Galwan Valley లో China రహస్య నిర్మాణాలు.. వెలుగుచూసిన Satellite చిత్రాలు!

  త‌మ బ‌ల‌గాల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు టిబెట్ పీట‌భూమికి 20 మంది మార్ష‌ల్ ఆర్ట్స్ నిపుణుల్ని పంపిస్తున్న‌ట్లు చైనా తెలిపింది.

  దీనికి వెనుక గ‌ల కార‌ణాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. అయితే ల‌ద్దాఖ్‌లోని గల్వ‌ాన్ లోయ‌లో జ‌రిగిన‌‌ ఘ‌ర్ష‌ణ‌ల్లో 20 మంది భార‌త సైనికులు మ‌ర‌ణించిన అనంత‌రం తాజా ప‌రిణామం చోటుచేసుకుంది.‌

  1996లో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం.. రెండు దేశాలు ఈ ప్రాంతాల్లో తుపాకులు, పేలుడు ప‌దార్థాలు ఉప‌యోగించ‌కూడ‌దు.

  ఘ‌ర్ష‌ణ‌లో త‌మ వైపు ఎంత మంది మ‌ర‌ణించారో చైనా వెల్ల‌డించ‌లేదు. అయితే, 20 మంది త‌మ సైనికులు అమ‌రుల‌య్యార‌ని, 76 మందికి గాయాల‌య్యాయ‌ని భార‌త్ తెలిపింది.

  చైనా ఆర్మీ సైనికులు

  మార్ష‌ల్ ఆర్ట్స్ నిపుణుల‌తో సైన్యానికి శిక్ష‌ణ‌కు సంబంధించిన వార్త‌లు చైనా అధికారిక వార్తా సంస్థ‌ల్లో జూన్ 20న వ‌చ్చాయ‌ని హాంగ్‌కాంగ్ మీడియా వెల్ల‌డించింది.

  ఎంబో ఫైట్ క్ల‌బ్‌కు చెందిన 20 మంది యోధుల‌ను టిబెట్ రాజ‌ధాని లాసాకు త‌ర‌లిస్తున్న‌ట్లు చైనా అధికారిక వార్తా సంస్థ సీసీటీవీ తెలిపింది. అయితే భార‌త్ స‌రిహ‌ద్దుల్లోని బ‌ల‌గాల‌కు వీరు శిక్ష‌ణ ఇవ్వ‌బోతున్నారా? అనే విష‌యాన్ని స్ప‌ష్టంచేయ‌లేదు.

  ఈ నెల 15న గల్వ‌ాన్ లోయ‌లో ఘ‌ర్ష‌ణ‌ల‌కు సంబంధించి త‌ప్పు మీదంటే మీద‌ని అణ్వాయుధ దేశాలైన భార‌త్‌, చైనా ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నాయి.

  అక్సాయ్ చిన్‌కు స‌మీపంలో క‌ఠిన‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌తోపాటు భారీ ఎత్తులో ఉండే ఈ వివాదాస్ప‌ద‌ ప్రాంతం త‌మ‌ద‌ని భార‌త్ చెబుతోంది. అయితే ప్ర‌స్తుతం ఇది చైనా నియంత్ర‌ణ‌లో ఉంది.

  రెండు బ‌ల‌గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం.. గ‌త 45 ఏళ్ల‌లో ఇదే తొలిసారి.

  తాజా ఘ‌ర్ష‌ణ‌లకు కొన్ని వారాల‌ ముందు నుంచీ వాస్త‌వాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబ‌డి భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు బ‌ల‌గాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి.

  భారతీయ సైనికుడు

  భారత్, చైనా దేశాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాల ప్రకారం.. గల్వాన్ లోయ ప్రాంతంలో సైనికులు తుపాకులు, ఇతర మారణాయుధాలను ఉపయోగించకూడదు.

  ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణల్లో ఇనుప ముళ్ల గదలను, రాడ్డులను, కర్రలను ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి.

  ఈ పరిస్థితుల మధ్య చైనా తమ సైనికులకు కఠోర పరిస్థితులను తట్టుకునేలా తీవ్రమైన శిక్షణ ఇస్తోంది.

  ఇవి కూడా చదవండి:

  (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

  English summary
  China has said it is moving 20 martial art trainers to the Tibetan plateau to train its forces.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X