నలుగురు కాదు 43 మంది, పలువురు గాయపడ్డారు కూడా, పెరిగిన చైనా జవాన్ల మృతుల సంఖ్య..?

తూర్పు లడాఖ్‌లోని గాల్వాన్ వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో చైనా ఆర్మీ నుంచి కూడా భారీగానే చనిపోయినట్టు తెలుస్తోంది. దాదాపు 43 మంది వరకు మృతిచెందారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు ఏఎన్ఐ వార్తాసంస్థ రిపోర్ట్ చేసింది.

రాత్రి జరిగిన ఘర్షణలో 43 మంది వరకు చైనా ఆర్మీ సిబ్బంది చనిపోయారని, మిగతావారు గాయపడ్డారని పేర్కొన్నది. దీనిని భారత్ కూడా ధృవీకరిస్తోందని ఏఎన్ఐ పేర్కొన్నది. మరోవైపు గాల్వాన్‌లో చైనా జవాన్లతో జరిగిన ఘర్షణలో 20 మంది వరకు చనిపోయారని తెలుస్తోంది. భారత జవాన్ల మృతుల సంఖ్య పెరగగానే చైనా సిబ్బంది కూడా 43 మంది చనిపోయారని ఏఎన్ఐ నివేదించింది.

China suffered 43 casualties during face-off with India in Ladakh

తొలుత భారత కల్నల్, ఇద్దరు జవాన్లు... చైనాకు చెందిన నలుగురు సిబ్బంది చనిపోయారని తెలిసింది. కానీ తర్వాత ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. అంతేకాదు ఇరువైపులా మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+