వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా నుంచి 2 సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్లు: ట్రేడ్ ఫెయిర్‌లో ప్రదర్శన, 300 మిలియన్ డోసులు

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ప్రపంచంపైకి కరోనా మహమ్మారిని వదిలి ప్రజలందర్నీ భయాందోళనలకు గురిచేసిన చైనా ఇప్పుడు.. కొవిడ్ 19కి వ్యాక్సిన్ తెచ్చామంటూ ప్రకటించింది. తొలిసారి తమ దేశం నుంచి రెండు కరోనా వ్యాక్సిన్ తెచ్చామంటూ ప్రదర్శించింది. బీజింగ్‌లో జరిగిన ట్రేడ్ ఫెయిర్‌లో వీటిని ప్రదర్శనకు పెట్టింది. ఈ రెండు వ్యాక్సిన్లపై చైనా భారీగానే ఆశలు పెట్టుకుంది.

 రెండోసారి కరోనా బారిన పడిన మొదటి మహిళ: బెంగళూరు ఆస్పత్రి వర్గాలు రెండోసారి కరోనా బారిన పడిన మొదటి మహిళ: బెంగళూరు ఆస్పత్రి వర్గాలు

ఏడాది చివరి నాటికి.. 300 మిలియన్ డోసుల ఉత్పత్తి..

ఏడాది చివరి నాటికి.. 300 మిలియన్ డోసుల ఉత్పత్తి..

చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్, సినోఫార్మ్ అనే రెండు కంపెనీలు ఈ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేశాయి. ఈ ఏడాది చివరి వరకు అన్ని రకాల అనుమతులు పొంది మార్కెట్లోకి తీసుకొస్తామని సదరు కంపెనీలు వెల్లడించాయి. సోమవారం భారీగా తరలివచ్చిన ప్రజలు ట్రేడ్ ఫెయిర్‌లో ఉంచిన ఈ వ్యాక్సిన్లను పరిశీలించారు. సినోవాక్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ..వ్యాక్సిన్ ఫ్యాక్టరీని నిర్మించడం పూర్తయిందని తెలిపారు. ఒక సంవత్సరంలో 300 మిలియన్ డోసులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉన్నామని తెలిపారు.

ప్రపంచ ప్రజల శ్రేయస్సు కోసమంటూ జింపింగ్..

ప్రపంచ ప్రజల శ్రేయస్సు కోసమంటూ జింపింగ్..

కాగా, కరోనా మహమ్మారిని ప్రపంచంపైకి వదిలి సంబరాలు చేసుకుంటోందంటూ ఇప్పటికే అమెరికాతోపాటు పలు దేశాలు డ్రాగన్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా మహమ్మారిని తామే అంతం చేస్తామంటూ ఇప్పుడు డ్రాగన్ దేశం చెబుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన కరోనాకు తమ దేశం నుంచే వ్యాక్సిన్ వస్తుందని చెబుతున్నారు. ప్రపంచ ప్రజల శ్రేయస్సు కోసం చైనా నుంచి ఒక సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ వస్తుందని గత మే నెలలోనే అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తెలిపారు.

పది వ్యాక్సిన్లలో చైనా నుంచి రెండు.. ఎక్కువ ధర ఉండదంటూ..

పది వ్యాక్సిన్లలో చైనా నుంచి రెండు.. ఎక్కువ ధర ఉండదంటూ..

ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న సుమారు 10 వ్యాక్సిన్లలో చైనాకు చెందిన ఈ రెండు వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ మూడోదశ ట్రయల్స్ చేరుకున్నాయి. రెగ్యూలేటరీల ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. ఒకసారి వ్యాక్సిన్ వస్తే తమ ఆర్థిక స్థితి గతులను కూడా మారిపోతాయని ఆశిస్తున్నాయి.

సినోఫార్మ్.. తన జబ్ నుండి ప్రతిరోధకాలను ఒకటి, మూడు సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్పింది. అయినప్పటికీ తుది ఫలితం ట్రయల్స్ తర్వాత మాత్రమే తెలుస్తుందని వెల్లడించింది. తమ దేశం నుంచి వచ్చే కరోనా వ్యాక్సిన్ ధర ఎక్కువగా ఉండదని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఇప్పటికే ప్రకటించింది.
ప్రతి రెండు డోసులు 146 డాలర్ల కంటే తక్కువగానే ఉంటుందని తెలిపింది.
తాను కూడా వ్యాక్సిన్ తీసుకున్నట్లు సినోఫార్మ్ చైర్మన్ ఇప్పటికే ప్రకటించినట్లు వెల్లడించింది.

మరో వ్యాక్సిన్ కూడా అంటూ చైనా..

మరో వ్యాక్సిన్ కూడా అంటూ చైనా..

చైనీస్ మిలిటరీ శాస్త్రవేత్తలు మరో వ్యాక్సిన్‌ అభ్యర్థిని అభివృద్ధి చేస్తున్నట్లు ఆ దేశ అధికారిక జిన్జువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కరోనావైరస్‌లోని మ్యూటేషన్స్‌పై పోరాడుతుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా గత నెల వరకు 5.7 బిలియన్ డోసుల వ్యాక్సిన్లు అభివృద్ధి జరుగుతున్నాయి. ఇప్పటికే వీటన్నింటికీ ముందుగానే ఆర్డర్లు వచ్చాయి. అయితే, కోవిడ్ -19 కు వ్యతిరేకంగా విస్తృతమైన రోగనిరోధకత వచ్చే ఏడాది మధ్యకాలం వరకు కార్డుల్లో ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

Recommended Video

Top COVID-19 Vaccines లోపాలు, Russia, China టీకాల్లో 40శాతం మాత్రమే సామర్థ్యం ! || Oneindia Telugu

English summary
China has put its homegrown coronavirus vaccines on display for the first time, as the country where the contagion was discovered looks to shape the narrative surrounding the pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X